‘పంచాయతీ’లో చంద్రబాబు ఎందుకు ఫెయిల్ అయ్యారు?

Update: 2021-02-10 03:43 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  తొమ్మిదేళ్లు.. విభాజిత ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజాగా పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నారు.? వచ్చే తిరుపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా..? ఆయన నిర్ణయాలపై పార్టీ నాయకులు ఏమంటున్నారు..? బాబు నిర్ణయాలే కొంపముంచుతున్నాయా..? ఇప్పుడు ఇవే  టీడీపీ శ్రేణులను సతమతమయ్యేలా చేస్తున్నాయట.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ నాయకులను ప్రస్టేషన్లోకి తీసుకెళ్లాయట.

70 ఏళ్ల వయసులోనూ బాబు మైండ్ యువకుడిలా పనిచేస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు. అంతేస్థాయిలో అప్ డేట్ నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ నాయకులు చెబుతారు కానీ చంద్రబాబు తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ మెనీఫెస్టో ప్రకటించలేదు.

పార్టీలకతీతంగా సాగే ఈ ఎన్నికల్లో మెనీఫెస్టో ఏమాత్రం పనిచేయదు. కానీ బుబు ఈసారి కొత్తగా మెనీఫెస్టోను విడుదల చేయడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ మెనిఫెస్టో ఏమాత్రం గ్రామాల్లోకి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. గ్రామాల్లోని టీడీపీ నాయకులు ఈ మెనిఫెస్టోను పట్టించుకోలేదట. అందుకే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మార్క్ కనిపించలేదు.

ఇక త్వరలో తిరుపతి పార్లమెంటరీ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థిని ప్రకటించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పనబాక లక్ష్మిపేరును చెప్పారు. దీంతో కొందరు నాయకులు ఆమెను ఎన్నుకోవడంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి నోటిఫికేషన్ విడుదల కాకుండానే ప్రకటించడంతో వైసీపీ కొత్త ఎత్తులు వేయడానికి అస్కారం ఉంటుందంటున్నారు.

దీంతో బాబు తీసుకునే నిర్ణయాలు ఔట్ డేటేడ్ గా ఉంటున్నాయంటున్నారు. దాదాపు 15 ఏళ్లుగా సీఎం పదవిలో ఉన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనను ఎదుర్కోలేకపోతున్నట్లు వ్యూహాలను బట్టి అర్థమవుతోంది.. మరోవైపు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, దీంతో వన్ మాన్ షోలా మారిందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News