బలమైన జగన్ ను ఇలా దెబ్బకొట్టిన చంద్రబాబు?

Update: 2021-02-13 10:30 GMT
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నైతికంగా గెలుచిందా..? చంద్రబాబు అనుకున్నదే రాష్ట్రంలో జరుగుతుందా..? జగన్ భయపడినట్లే అయిందా..? ఇంతకాలం నిమ్మగడ్డ రమేశ్ పంచాయతీ ఎన్నికల కోసం పట్టుబట్టడం చంద్రబాబుకు ప్లస్ పాయింట్ గా మారిందా..? ఈ ప్రశ్నలపై చర్చలు రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మొదటి విడత ముగిసి రెండో విడత ఎన్నికల కోసం జరుగుతున్న పంచాయతీ పోరులో అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీ లాభపడిందంటున్నారు. ఈ ఎన్నికలపై జగన్ టెన్షన్ పడుతుంటే.. బాబు నవ్వుల పూయిస్తున్నాడట..

ఏపీలో పార్టీల సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత పూర్తి కాగా.. రెండో విడత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఇష్టం లేని ప్రభుత్వం మొదటి నుంచీ వీటిని వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఎలక్షన్ కమిషన్ రాజ్యంగం ప్రకారం నిర్వహించాలని కోర్టుల దాకా వెళ్లడంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎలక్షన్ చెప్పిన విధంగానే నడుచుకుంటోంది.

అయితే పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లోని వైసీపీలో వర్గపోరు బయటపడుతోంది. ముఖ్యంగా పార్టీలో గ్రూపులు ఏర్పడి గొడవలు తయారవుతున్నాయి. నామినేషన్ వేసే విషయంలోనూ సొంత పార్టీ వ్యక్తులే దాడులు చేసుకోవడం గమనార్హం. ఇది ఏ ఒక్కచోట కాకుండా దాదాపు అన్ని గ్రామాల్లోనూ సాగుతోంది. ఈ విషయంలో జగన్ ముందే అంచనా వేశారని, అందుకే పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వైపీపీకి ఇది పెద్ద దెబ్బ తగలనుంది.

ఇక టీడీపీ మాత్రం ఈ వ్యవహారాన్ని క్యాష్ చేసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు లేకున్నా కొందరికి మద్దతు ఇచ్చి వారికి అండగా నిల్చుంటోంది. ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి వారిని అభ్యర్థుల తరుపున ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నిత్యం కొందరు అభ్యర్థులతో నేరుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీంతో మొన్నటి వరకు టీడీపీలో కామ్ గా ఉన్నవారు ఒక్కసారిగా ఉత్సాహం తెచ్చుకుంటున్నారు.

ప్రభుత్వం ఏకగ్రీవానికి పట్టుబడుటున్నా టీడీపీ కొందరు అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తూ ఎన్నికలు జరిగేలా చూస్తుంది. దీంతో కొన్ని చోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్రబాబుకు మేలే చేశారని చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News