' బై బై నేను దేవుడి దగ్గరకు వెళిపోతున్నా ' ... ఆస్పత్రి పై నుండి దూకి కరోనా రోగి సూసైడ్ !
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు. ఈ నేపథ్యంలో కరోనా భయం తో చాలామంది ఆత్మహత్య కి పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా రోగి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే .. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కరోనా లెవెల్ 1 ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆసుపత్రి మూడో ప్లోర్ కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ నెల 17వతేదీ నుండి కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్సకోసం వచ్చాడు. మృతుడిని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు గా పోలీసులు గుర్తించారు. మృతునికి సపర్యలు చేసేందుకు అతని కుటుంబసభ్యులకు కూడా అనుమతించారు అశుపత్రి సిబ్బంది. గత మూడురోజులుగా నేను దేవుడు దగ్గరకి వెళిపోతా అంటూ అకస్మాత్తుగా అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆస్పత్రిలోని వారు చెబుతున్నారు. రాంబాబు ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలోనే కుటుంబసభ్యులు సమీపంలోనే ఉన్నారు. తెల్లవారుజామున ‘బై బై నేను దేవుడి దగ్గరకు వెళిపోతున్నా’ అని బిగ్గరగా అరుస్తూ కిటికీలోనుండి దూకేశాడు. ఆసుపత్రిలో తమ కుమారుడి మంచి చెడ్డలు దగ్గరుండి చూసుకుంటున్నామని, బానే ఉన్నాడని, బాగానే తింటున్నాడని రాంబాబు కుటుంబసభ్యులు తెలిపారు. ఇవాళో రేపో డిశ్చార్జ్ కావాల్సిన కొడుకు ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ తండ్రి అన్నవరం కన్నీరు పెట్టుకున్నారు.