'వదల బొమ్మాళీ' అంటున్న కరోనా.. కోలుకున్న వారి గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం
అసలు చాలా మంది కరోనా విషయంలో చాలా అపోహలను నమ్ముతున్నారు. జీవితంలో ఎప్పుడో ఒకసారి కరోనా బారిన పడాల్సిందేనని, ఒకసారి సోకి కోలుకుంటే ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపొచ్చని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని భావిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. కరోనా బారిన పడిన తరువాత, మనిషి పై అది దీర్ఘకాలంలో ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై చైనాలోని వుహాన్ సిటీ వైద్య నిపుణులు పరిశోధనలు చేశారు. వారు వెల్లడించిన విషయాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అధికంగా తలెత్తుతున్నట్లు గుర్తించారు. కొందరు ఆ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత గుండెపోటుతో చనిపోతుండగా, 90 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో అవస్థలు పడుతున్నారు.
చైనాలోని వుహాన్ యూనివర్సిటీకి చెందిన జోంగాల్ ఆస్పత్రి బృందం ప్రొఫెసర్ పెంగ్ జియాంగ్ నేతృత్వంలో కరోనా నుంచి కోలుకున్న 100 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు.
కరోనా బారిన పడి కోలుకున్న 59 ఏళ్ల వయసు వాళ్లపై అధ్యయనం సాగించారు. వారిలో ఊపిరితిత్తుల్లో వెంటిలేషన్, గ్యాస్ మార్పిడి వ్యవస్థలు పూర్తిగా కోలుకోలేదని తేల్చారు. కోలుకున్న వాళ్లకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళతో కలిసి వాకింగ్ టెస్ట్ నిర్వహించగా ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఆరోగ్యంగా ఉన్నవారు ఆరు నిమిషాల్లో 500 మీటర్లు నడుస్తుండగా, కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మాత్రం ఆరు నిమిషాల్లో 400 మీటర్ల దూరం మాత్రమే నడుస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 90 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ఐదు శాతం మందికి కరోనా తిరగబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా కరోనా పట్ల జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.