సంచలనంగా మారిన టీఎస్ పీఎస్పీ పేపర్ లీకేజీ స్కాం వ్యవహారానికి సంబంధించి.. అసలు బయటకు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. విచారణలో భాగంగా.. అసలేమైందన్న విషయాన్ని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటున్న వెళ్లినప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ నెల ఐదున నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావటానికి కారణం.. దావత్ చేసుకున్న వేళ డబ్బు పంపాలకు సంబంధించి వాటాల వద్ద చోటు చేసుకున్న పంచాయితీనే మొత్తం కథ బయటకు రావటానికి కారణంగా చెబుతున్నారు.
పరీక్షకు సంబంధించిన పేపర్ ను లీకేజీలో కీలకమైన ఏ1 ప్రవీణ్ వద్ద నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న రేణుక, డాక్యా దంపతులు పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. తాము తీసుకొచ్చిన పేపర్ ను రేణుక తమ్ముడు రాజేశ్వర్ చేతచదివించి.. ప్రిపేర్ అయ్యేలా చేశారు. అనంతరం తమ కారులో సరూర్ నగర్ లోని ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్లి అతన్ని ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం వారంతా కలిసి దావత్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. దావత్ వేళ ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దావత్ వేళలో డబ్బుల పంపిణీ వ్యవహారం రచ్చకు కారణమైందంటున్నారు. ఒక్కొక్కరు రూ.10 లక్షల మొత్తాన్ని రేణుకకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే.. ముందుగా అనుకున్న ప్రకారంగా కాకుండా ముందు రూ.5 లక్షలు ఇచ్చి.. ఆ తర్వాత మిగిలినవి తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే.. అందుకు ఒప్పుకోని రేణుక.. తనకు ఇస్తామన్న రూ.10 లక్షలు అప్పుడే ఇవ్వాలని గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో నీలేశ్ నాయక్.. రేణుక మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిందని.. ఆ సందర్భంగా రేణుకను నీలేశ్ బెదిరించటంతో ఆమె బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. హుటాహుటిన రేణుక చెప్పిన ప్లేస్ వద్దకు వెళ్లిన పోలీసులు.. ప్రాథమిక ప్రశ్నల అనంతరం లీకేజీ డొంక బయటకు రావటం.. అందరిని అదుపులోకి తీసుకోవటంతో అసలు కథ బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.