టీడీపీ ఏజ్డ్ పార్టీ అని అందుకే అనాల్సి ఉంది. పార్టీ దశాబ్దాలుగా ఎదిరి పెరిగితే ఇలాంటి సమస్యలే వస్తాయి. సీనియర్లు తప్పుకోరు, వారసులు కూడా రెడీ అయిపోతారు. అసలే కుటుంబ పార్టీగా టీడీపీకి బలమైన ముద్ర ఉంది. దానికి తోడు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు లోకేష్ రాజకీయాలను చేస్తూంటే జిల్లాలలో నేతలు కూడా తామూ తమ వారసులూ అంటూ లెక్కలేవో కట్టేసుకుంటున్నారు.
దీంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి. అదే టైమ్ లో ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అంటే అది ముందుగా బాబు నుంచే వర్తింపచేయాలి అన్న చర్చ కూడా వస్తుంది కదా. ఏపీలో ఫ్యామిలీస్ కి ఫ్యామిలీస్ ఇలా టికెట్ల కోసం కోట్లాటకు ఇప్పటి నుంచే దిగిపోతూండడం స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. రీసెంట్ గా అనంతపురం జిల్లా ధర్మవరం సీటు తనకే అని పరిటాల శ్రీరామ్ గర్జించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలకే రామ్ రామ్ అని కూడా చెప్పేశారు.
ఈ విధంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం అంటే అది నేరుగా చంద్రబాబుకే అని కూడా అంతా అంటున్నారు. ఎందుకంటే టికెట్ ఇచ్చేది, మానేదీ కూడా చంద్రబాబే కాబట్టి. ఇంతకీ ధర్మవరం టికెట్ ఎందుకు అంత బలంగా శ్రీరామ్ కోరుకుంటున్నారు అంటే ఆయన రెండున్నరేళ్ళుగా అక్కడ టీడీపీకి ఇంచార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో గోనుగుంట్ల సూర్యనారాయణ ఉరఫ్ వరదాపురం సూరి గెలిచారు.
అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతోనే పార్టీ ఫిరాయించేశారు. బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ టీడీపీకి సరైన లీడర్ షిప్ లేక చంద్రబాబు పరిటాల శ్రీరామ్ కి ధర్మవరం బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి శ్రీరామ్ ఆ సీటును వేయి కళ్లతో చూసుకుంటూ వస్తున్నారు. నిజానికి శ్రీరామ్ కి ధర్మవరం ప్రేమ ఈ రోజుది కాదు, 2019 ఎన్నికలోనే పోటీకి రెడీ అన్నారు.
కానీ చంద్రబాబు మాత్రం వరదాపురం సూరికే టికెట్ ఇచ్చారు. మరి సూరి పార్టీకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆయన తిరిగి పార్టీలోకి వచ్చినా తీసుకోవద్దు అన్నదే శ్రీరామ్ మాటగా ఉంది. అయితే వైసీపీ దూకుడు తట్టుకోలేకనే బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి 2024 ఎన్నికల ముందు కచ్చితంగా టీడీపీలోకి వస్తారు అన్న టాక్ ఉంది. దాంతోనే ముందు జాగ్రత్తగా శ్రీరామ్ ఈ హెచ్చరికలు చేశారని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాబు శ్రీరామ్ కి ధర్మవరంలో టికెట్ ఇస్తే, ఆయన తల్లి, మాజీ మంత్రి పరిటాల సునీతకు రాప్తాడులో టికెట్ దక్కడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. ఆ విధంగా తల్లీ కొడుకులు పోటీ చేసి తెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు వద్ద ఇలాంటి ఫ్యామిలీ ప్యాకేజిలు కుదురుతాయా అన్న చర్చ కూడా ఉంది.
పైగా వరదాపురం సూరికి ధర్మవరంలో బాగా పట్టుంది. ఆయన మళ్ళీ వచ్చి సీటు అడిగితే బాబు నో చెబుతారా అన్న మాట కూడా వినిపిస్తోంది. అదే టైమ్ లో పరిటాల సునీత పోటీ చేయడం కంటే శ్రీరామ్ నే రాప్తాడు చూసుకోమని చెప్పే వీలుంటుందని కూడా అంటున్నారు. అలా పరిటాల ఫ్యామిలీని రాప్తాడుకే పరిమితం చేయాలన్న ఆలోచనలు అధినాయకత్వానికి ఉన్నాయని అంటున్నారు. అయితే శ్రీరామ్ తాజా హెచ్చరికలతో లెక్కలు ఏమైనా మారుతాయా అన్న చర్చ ఉంది.
అయితే తల్లీ కొడుకులు వేరు వేరు సీట్లలో పోటీ చేస్తే విజయానికి సహకారం ఒకరికి ఒకరు చేసుకోలేరని, అదే విధంగా టఫ్ గా నడచే 2024 ఎన్నికల్లో ఇలాంటి రిస్క్ చేస్తే మొదటికే మోసం వస్తుంది అన్న ఆలోచనలు కూడా హై కమాండ్ కి ఉన్నాయట. మొత్తానికి తల్లీ కొడుకులు పోటీకి రెడీ అంటున్నారు. మరి బాబు ఊ అంటారా. ఉహూ అంటారా అన్నదే తేలాల్సిన విషయం.