అసలే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో నేతలు నోరు కాస్త హద్దుల్లో పెట్టుకోవాలి. లేకపోతే కేసుల చిక్కులు తప్పవు. ఇప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కు కూడా ఇదే అనుభవంలోకి వచ్చింది. సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయించుకోవడానికి అన్నట్టుగా కాస్త హల్చల్ చేశారు శ్రీరామ్. మామూలుగా అయితే తమ వర్గం వారు భయపడతారేమో అని.. తనే ముందుకు దిగి కాస్త హాట్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాలను కూలుస్తామంటూ చెప్పుకొచ్చారు.
రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరిలో ఇది వరకూ వైఎస్ విగ్రహాలను కూల్చిన ఘనత తమదే అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ అదే పని జరగుతుందని, తాము అధికారంలోకి వస్తే మొదటి 15 నిమిషాల్లోనే వైఎస్ విగ్రహాలను కూలుస్తామంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
అంతే అధికారంలో ఉంటే.. కేసుల భయం ఉండదు కాబట్టి అలాంటి అరచకాలకు తాము తెగబడగలమని, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి తాము ఏం చేయలేకపోతున్నట్టుగా పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదంతా వీడియోలకు ఎక్కింది.
మామూలుగా ఇలా మాట్లాడి ఉంటే అది పెద్ద కేసు అయ్యేది కాదేమో. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా, హింసాత్మక పరిస్థితులను తలెత్తేలా మాట్లాడిన పరిటాల శ్రీరామ్ పై కేసు తప్పినట్టుగా లేదు. ఈ మేరకు రామగిరి పోలీసులే ప్రకటించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన వ్యవహారంలో శ్రీరామ్ పై కేసు నమోదు చేసినట్టుగా వారు తెలిపారు.