ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - మంత్రి లోకేశ్ పై వైసీపీ అధికార ప్రతినిధి పార్థ సారధి నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి కేవలం నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి పెట్టారని మండి పడ్డారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని, తండ్రి బాటలోనే తనయుడు లోకేశ్ పయనిస్తున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కేవలం నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు పైనే దృష్టి పెట్టారన్నారు. నంద్యాలలో గెలుపు కోసం రూ.300 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చారన్నారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి చూసిన ప్రజలు....తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చనిపోతే బాగుండు...అని ప్రజలు అనుకుంటున్నారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డే స్వయంగా వ్యాఖ్యానించారన్నారు.
ఆ వ్యాఖ్యలు చూస్తుంటే నంద్యాలలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. గత మూడేళ్లుగా టీడీపీ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆ పార్టీవాళ్లే ఒప్పుకుంటున్నారన్నారు. మిగతా నియోజకవర్గాలతో పాటు, ఇతర జిల్లాలకు చంద్రబాబు ఏం చేశారని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికలో నంద్యాల ప్రజలు టీడీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు.
నారా లోకేశ్ పై పార్థసారధి విరుచుకుపడ్డారు. ఆయన తండ్రి లాగే లోకేశ్ కూడా అబద్ధాలు చెబుతున్నారన్నారు. ‘ రాయలసీమకు 5 లక్షల ఉద్యోగాలు అంటూ లోకేష్ అబద్ధాలు ఆడారన్నారు. ఇదే విషయంపై లోకేష్ ను కర్నూలు ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఆయన వల్ల ప్రఖ్యాత స్టాండ్‌ఫార్డ్ యూనివర్శిటీ ప్రతిష్ట కూడా దిగజారిందన్నారు. బలహీనవర్గాలపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. బలహీన వర్గాలను కించపరిస్తే తాము చూస్తూ ఊరుకోమని పార్థ సారధి హెచ్చరించారు.