తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చేసిన జాతీయ పార్టీ ప్రకటన తర్వాత.. ఏపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. అదేంటి అను కుంటున్నారా? ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలు.. ఇతర ప్రాంతీయ పార్టీలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఆయా రాష్ట్రాల్లోని నాయకులను మెప్పించారు. తాను పెడుతున్న పార్టీకి మద్దతు కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దించేందుకు కలిసిరావాల న్నారు. విందు సమావేశాలు నిర్వహించారు. అంతా.. ఓకే.. ఓకే.. చివరకు పార్టీ ప్రకటన వరకు వచ్చింది.అయితే, ఇక్కడే పెద్ద ధర్మ సందేహం జాతీయ స్థాయిలో వినిపించింది.
"ఇంతమందిని ఏకం చేస్తున్న కేసీఆర్.. తన పొరుగు రాష్ట్రం, దాయాది రాష్ట్రం ఏపీపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతు న్నారనేది అర్ధం కావడం లేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో సహకరించేవారు ఎవరూ లేరా?" అంటూ.. జాతీయస్థాయిలో కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయిన కేసీఆర్. వెంటనేఏపీపై దృష్టి పెట్టారు.
నిజానికి ఏపీలో అధికార పార్టీ వైసీపీ.. బీజేపీకి. ముఖ్యంగా మోడీకి అనుకూలంగా ఉంది. మోడీకి జగన్ దత్తపుత్రుడని.. బీజేపీనాయకులే పేర్కొన్నారు. ఇక, టీడీపీ కూడా.. బీజేపీతో కలిసి అడుగులు వేసేందుకు రెడీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు తనకు అనుకూలంగా ఉండవని.. కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్.. నాయకులను నమ్ముకున్నారు. అంటే... పార్టీల్లో ఉన్నారా? లేదా.. అనే విషయంపై సంబంధం లేకుండా.. నాయకులను టార్గెట్ చేసుకున్నారు.
అంటే.. పార్టీలకు దూరంగా ఉన్నవారిని.. తటస్థంగా ఉన్నవారిని.. సామాజిక వర్గాల్లో గుర్తింపులేదని బాధపడుతున్నవారిని.. అసంతృప్త నేతలను.. టికెట్ వస్తుందో రాదో.. అనే గందరగోళంలో ఉన్నవారిని.. ఇలా.. అనేక రూపాల్లో.. నాయకుల విషయాన్ని సేకరించి పెట్టుకున్నట్టు సమాచారం.
ఇలాంటివారిలో వైసీపీ, టీడీపీ సహా.. బీజేపీ నాయకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఎవరెవరు.. కేసీఆర్‌తో టచ్‌లోకి వస్తున్నారు? ఎవరు.. వ్యూహాత్మకంగా ఉన్నారనే అంశాలపై కూపీలాగుతున్నట్టు తెలుస్తో్ంది. సాధ్యమైనంత వరకు కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.