ర‌చ్చ‌ర‌చ్చే:డీఎస్పీ వెహికిల్‌ ని ఆటో ఢీ కొంటే..?

Update: 2015-09-09 12:00 GMT
మీరు రోడ్డు మీద వెళుతున్నారు. మీ వాహ‌నాన్ని ఒక ఆటో ఢీ కొ్ట్టింది. ఆటోవాడ్ని అడ్డుకొని అత‌డ్ని పోలీస్ స్టేష‌న్‌ కు ర‌మ్మంటే.. రాడు. స‌ర్లే అని.. అక్క‌డే ఉన్న కానిస్టేబుల్ ద‌గ్గ‌ర‌కు వెళితే.. స‌ర్దిచెప్పి పంపుతారు. లేదంటే.. నాలుగు తిట్లు తిట్టి పంపుతారు.

సామాన్యుడికి ఇలాంటి అనుభవం ఉంటే.. మ‌రో డీఎస్పీ వెహికిల్ ని ఒక ఆటో డ్యాష్ ఇస్తే.. ఏం జ‌రుగుతుంది? ఇలాంటి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు క‌డ‌ప జిల్లా పోలీసులు.

రాజంపేట డీఎస్పీ వాహ‌నాన్ని ఒక ఆటో ఢీ కొంది. ఈ సంద‌ర్భంగా డీఎస్పీగారి వాహ‌నం వెనుక‌భాగం పాక్షికంగా దెబ్బ‌తింది. అయ్య‌గారికి కోపం న‌శాళానికి అంటింది. అంతే.. సీఐలు.. ఎస్ ఐలు.. ఎఎస్ ఐలు.. కానిస్టేబుళ్లు ఇలా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రోడ్ల మీద‌కు వ‌చ్చేశారు. ఆటోల మీద పోలీస్ ప్ర‌తాపం ప్ర‌ద‌ర్శించారు.

రోడ్డు మీద ఆటో క‌నిపిస్తే చాలు.. దాన్ని తీసుకొని పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లిన వారు.. వాహ‌నం న‌డిపే వారి వివ‌రాలు మొద‌లుకొని.. ఆటో ప‌త్రాల వ‌ర‌కు.. అన్నింటిని క్షుణ్ణంగా చెక్ చేయ‌టం.. ఏ మాత్రం తేడా క‌నిపించినా వెంట‌నే కేసు బుక్ చేసేశారు. మ‌రీ.. ఆరాచ‌కం ఏమిటంటే.. ప్యాసింజ‌ర్ లు ఆటోలో ఉన్న‌.. వారిని రోడ్ల మీద దించేసి మ‌రీ.. ఆటోలు తీసుకొని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

ఇలా ఆటోల మీద పోలీసులు చూపించిన ప్ర‌తాపానికి రాజంపేట ఆటోవారు బెంబేలెత్తిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ర‌క‌ర‌కాల స‌ర్టిఫికేట్ల మొద‌లు.. రూల్ బుక్‌ ని య‌థాత‌ధంగా అమ‌లు చేయ‌టంతో అయ్య‌గారి వాహ‌నాన్ని గుద్దితే వ్య‌వ‌స్థ ఎంతగా స్పందిస్తుందో చూసి సామాన్యులు షాక్ తిన్న ప‌రిస్థితి. డీఎస్పీనా మ‌జాకానా? ఆటోల మీద క‌న్నేసిన రాజంపేట పోలీసుల దెబ్బ‌కు ఒక్క‌పూట వ్య‌వ‌ధిలో వంద ఆటోలు పోలీస్ స్టేష‌న్ ల‌కు చేర‌ట‌మే కాదు.. వేలాది రూపాయిలు జ‌రిమానాలుగా విధిచంటం విశేషం. ఒక్క రాజంపేట‌లోనే కాదు.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనూ ఆటోల మీద పోలీసులు తామేంటో చూపించ‌టం ఆటోవాలాల‌తో పాటు.. సామాన్య ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు.
Tags:    

Similar News