ఊహకు అందని పనులు ఈ మధ్యన చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి పనే చేసి షాకిచ్చాడో వ్యక్తి. అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక ప్రయాణికుడి చేసిన పనికి విమానంలోని వారంతా బిత్తరపోయారు. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక నోటి వెంట మాట రాని రీతిలో ఉండిపోయారు.
సీటెల్ నుంచి అంకొరేజ్ కు వెళుతున్న విషయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఏం జరిగిందంటే.. తండ్రితో పాటు ఒక యువకుడు విమానం ఎక్కాడు. ఏమైందో ఏమో కానీ.. విమానం ల్యాండ్ కావటానికి కాసేపటి ముందు నగ్నంగా ఫ్లైట్లో పరిగెత్తాడు. అతడి తీరుతో అవాక్కైన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అతగాడి వికృత చర్యకు షాక్ నుంచి తేరుకున్న విమాన సిబ్బంది అతడ్ని బాత్రూంలో బంధించారు.
విమానంలో వికృతంగా వ్యవహరించిన వ్యక్తిని ఎయిర్ మార్షల్ తో పాటు మరో వ్యక్తి కలిసి ఆ యువకుడ్ని విమానంలోని బాత్రూంలో బంధించారు. అతను డ్రగ్స్ తీసుకొని ఉండటం వల్ల ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని అలస్కా మాజీ సెనేటర్ ఎల్లిస్ గ్రిన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ ఘటన మినహా తమ విమాన ప్రయాణం బాగా సాగిందని కొందరు ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై అలస్కా ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందిస్తూ.. ఫ్లైట్ లో మొత్తం 107 మంది ప్రయాణికులు ఉన్నారని.. నగ్నంగా పరిగెత్తిన వ్యక్తిని బంధించి బాత్రూంలో ఉంచటం సరైన చర్యగా అందరూ భావించారని.. విమానం ల్యాండ్ అయ్యాక అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లుగా వెల్లడించారు.