పతంజలి రామ్‌ దేవ్ బాబాపై ఛీటింగ్ ఆరోపణలు .... అరెస్టు చేస్తారా ?

Update: 2021-02-23 11:30 GMT
యోగా గురువుగా పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రాచుర్యం పొందిన రామ్‌ దేవ్ బాబా గురించి అందరికీ తెలిసిందే. దేశీయ కంపెనీ బ్రాండ్‌తో మార్కెట్‌ లో నిలదొక్కుకోవడమే కాకుండా లాభాలార్జిస్తున్న సంస్థ. ఇప్పుడు ఒక్కసారిగా పతంజలి రామ్‌ దేవ్ బాబా  పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్‌ కు ఆ కంపెనీ ప్రవేశపెట్టిన మందు. కరోనా సమయంలో కరోనా వైరస్‌ కు విరుగుడుగా ప్రకటిస్తూ పతంజలి సంస్థ కోరోనిల్అ నే మందు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్షన్ - మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ల సమక్షంలో కోరోనిల్ మందును రామ్‌ దేవ్ బాబా విడుదల చేశారు.

వ్యాక్సిన్  విడుదల సమయంలో కొరొనిల్‌ కు‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికెట్‌ ఉందని చెప్పి రామ్‌ దేవ్‌ బాబా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము పతంజలి ఉత్పత్తులకు ఏ విధమైన సర్ఠిఫికేట్ జారీ చేయలేదని ట్వట్టర్‌ లో స్పష్టం చేసింది. దీంతో ప్రజలను మోసం చేయాలని చూసిన యోగా గురును అరెస్టు చేయాలని పలు ఆరోగ్య సంస్థలు - సామాజిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సూర్య ప్రతాప్‌ సింగ్‌ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ సోమవారం ట్వీట్‌ చేశారు.‘డియర్‌ ఢిల్లీ పోలీసు..  ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్‌ దేవ్‌ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్‌ వేదికగా కోరారు. ఈ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
Tags:    

Similar News