పవన్ కల్యాణ్ కి అశేషమైన అభిమాన గణం ఉంది. వారంతా జై పవన్ అంటూ పూనకాలే వేస్తారు. పవన్ మానియా ఏంటో వారిని చూస్తే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం చొక్కాలు చింపుకుంటారు. పవన్ నామ జపంతో తరిస్తారు. పవన్ తోనే తమ జీవితం అనుకుంటారు అలాంటి నిండైన అభిమాన ధనం పవన్ కి ఉండడం గొప్ప విషయం.
లక్షలాది మంది అభిమానులు పవన్ కి ఉన్నారు. వారు పవన్ పిలుపు కోసం సైతం ఎదురుచూడకుండా పనిచేస్తారు. పవన్ ఫ్యాన్ అని చెప్పుకోవడమే తమకు గర్వమని కూడా అంటారు. అలాంటి అభిమానులు ఉండగా పవన్ పార్టీ పెట్టాక ఎందుకు గెలవలేకపోతున్నారు అన్నది అతి పెద్ద సందేహం.
నిజంగా ఈ ఫ్యాన్స్ అంతా కలసి ఓటేస్తే జనసేన వెంటనే అధికారంలోకి రాకపోవచ్చేమో కానీ బలీయమైన శక్తిగా ఏపీలో ఉంటుంది. ఇక ఈ అభిమానులు ఒక్కొక్కరూ పదేసిమందికి తమ పార్టీ గురించి చెప్తే చాలు జనసేన పటిష్ఠంగా మారుతుంది. రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జనసేనకు అధికారం దక్కే అవకాశాలు కూడా నూటికి నూరు శాతం ఉంటాయనే భావించాలి.
పవన్ కళ్యాణ్ వంటి చరిష్మాటిక్ లీడర్ లీడ్ చేస్తున్న జనసేనకు ఫ్యాన్స్ కూడా అతి పెద్ద సైన్యంగా ఉండాలి. కానీ చిత్రమేంటి అంటే కేవలం సినిమాల వరకే చాలా మంది కట్టుబడి ఉండిపోయారు. రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎవరి ఫిలాసఫీ వారిది అన్నట్లుగా ఉంటున్నారు. మరి లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. పవన్ ఫ్యాన్స్ అంటే ఆయనను నచ్చే కదా మెచ్చే కదా వారు అయినది.
పైగా పవన్ని సినీ హీరో కంటే కూడా బయట ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి ఆరాధిస్తామని చెబుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పవన్ రాజకీయ పార్టీ పెట్టి ఏపీలో భారీ మార్పును తీసుకువస్తామని అంటే ఫ్యాన్స్ కూడా ఉడతా భక్తిగా తమ వంతు చేయాలి కదా. అయితే ఫ్యాన్స్ లో అందరూ కాదు కొందరు అలా జనసేనకు అంకితం అయి పనిచేస్తున్నారు. కానీ నూటికి నూరు శాతం ఫ్యాన్స్ జన సైనికులుగా టర్న్ అయినపుడే పవన్ అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారు అని అంటున్నారు.
పవన్ సీఎం అని వేదికల మీద అరచి గోల చేసే ఫ్యాన్స్ తీరా పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్ళినపుడు వేరే పార్టీలకు ఓటేస్తున్నారు అని సాక్స్థాత్తూ పవనే చాలా సందర్భాల్లో అన్నారు. మరి వారి ఓట్లు అన్నీ జనసేనకు పడితే పవన్ పార్టీ పరిస్థితి వేరే లెవెల్ లో ఉండాలి కదా. అందుకే పవన్ సైతం తనను సీఎం సీఎం అని అనవద్దు, అలా అరచి గోల చేయవద్దు అని చెబుతూనే ఉన్నారు. చేయాల్సింది చేయండి అంతే తప్ప ఊరకే నినాదాలు ఎందుకు అన్నది పవన్ మాట.
ఆ మాటను విని పవన్ ఫ్యాన్స్ జనసైనికులుగా మారాల్సి ఉంది. అలాగే అపారమైన అభిమాన గణాన్ని సుశిక్షితులైన కార్యకర్తలుగా జనసేన మలచుకోవాలి.. అపుడే అద్భుతాలు సృష్టించగలరు. ఈ విషయంలో 2024 ఎన్నికలు ఒక టెస్ట్ లాంటివి. కచ్చితంగా గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని జనసైనికులు అంటున్నారు. అన్నీ కలసి వస్తే అధికారాన్ని కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో ఫ్యాన్స్ పాత్ర అత్యంత కీలకం కావాలని అంతా ఆశిస్తునారు.
తమ హీరో రాజకీయ నాయకుడు కావాలని ఏపీ సీఎం కావాలని దృఢ సంకల్పం కనుక ఫ్యాన్స్ కి వస్తే వారే జనసేనను ముందుకు తీసుకొస్తారు. ఏపీలో ఏ రాజకీయ పార్టీకి లేనంత బలం యువ శక్తి ఉన్న ఏకైక పార్టీ జనసేన. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.