తెలంగాణ పోరాట తత్వంపై పవన్ గొప్ప వ్యాఖ్యలు

Update: 2021-10-09 13:10 GMT
తెలంగాణ పోరాట తత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ గొప్ప వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రతి వ్యక్తికి పోరాడే తత్వం ఉంటుందని.. తెలంగాణలో ఉన్న గొప్పదనం ఏమిటంటే.. 17 ఏళ్ల కుర్రాడులో సమస్యపై పోరాడతారని పవన్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్య కోసం తన వద్దకు వచ్చిన తీరు ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. అంత గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమని అన్నారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్య కోసం తనవద్దకు వచ్చిన తీరు ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. అంత గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమన్నారు.

తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ధైర్యం నింపిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసేది లేదని చెప్పారు పవన్ కళ్యాణ్. దెబ్బలు కొట్టే కొద్దీ మరింత ఎదుగుతామన్నారు. అడుగు పడితే తప్ప అనుభవం రాదని అన్నారు.

తనకు పుస్తకాల్లో చదివిన దానికంటే.. ప్రత్యక్షంగా తిరిగినందువలన సమాజానికి కావాల్సిన అవసరాలు తెలిశాయని చెప్పారు. నేను కులం గురించి మాట్లాడుతుంటే.. కులాల రొచ్చులో ఎందుకు దిగుతున్నారు అని అంటున్నారు. కులం , రంగు, మతం మన ఛాయిస్ కాదని.. కులం అనేది సామాజిక సత్యం. అది అర్థం చేసుకొని సామాజిక రుగ్మతను తొలగించే దిశగా అడుగు వేయాలన్నారు. జనసేన పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంటుందని.. అన్ని కులాల అన్ని మతాల వారున్నారు.. మన హక్కుల ఎదుటివారి హక్కులు భంగం కలిగించనంత వరకే అని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

హిందుత్వ వాదంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. హిందువుల దేవాలయ మీద దాడి జరిగితే ఖండిస్తే.. దాని వలన ఓట్లు పోతాయని తాను అనుకోలేదన్నారు. భాషలను గౌరవించే సంప్రదాయం.. తమ పార్టీ ఖచ్చితంగా పాటిస్తోందని.. మన భాషని యాసని తాను గౌరవిస్తున్నట్టు చెప్పారు. సంస్కృతిని కాపాడే విధంగా తాము నడుచుకుంటామని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రాంతీయ వాదాన్ని అగౌరవ పరిస్తే మేము ఈ దేశానికి చెందిన వారిమేనా? అని చాలా మంది బాధ పడ్డారు. అందుకని ప్రాంతీయ వాదాన్ని గౌరవిస్తూ దేశాన్ని ప్రేమించాలని సూచించారు. సమాజంలో ఉన్న సమస్యలే వర్గ శత్రువులని చెప్పారు.




Tags:    

Similar News