‘నేను ఒక సమస్య పై నిలబడినపుడు పార్టీలు, ప్రజలు నా వెనుక నిలబడకపోతే నాకు మరో సారి గొంతెత్తే ధైర్యం ఉంటుందా ?’ ? దీక్ష విరమణ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్న.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా పవన్ మంగళగిరి లోని పార్టీ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ చాలా విషయాలే మాట్లాడారు. అలాంటి మాటల్లో పైన వేసిన ప్రశ్నకూడా ఒకటి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంతే తాను వేసిన ప్రశ్న లోనే సమాధానం కూడా ఉందని పవన్ తో పాటు అందరికీ తెలుసు. అయినా అమాయకంగా పవన్ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే జనాలెవరు లేరని పవన్ ఎప్పుడు అర్ధం చేసుకుంటారో.
ఇక్కడ విషయం ఏమిటంటే సమస్య పై నిలబడినపుడు ప్రజలు, పార్టీలు తన వెనుక ఎందుకు నిలబడటం లేదనేది పవన్ ప్రశ్న. ఎవరు ఎందుకు నిలబడటం లేదంటే పవన్ పిరికివాడన్న విషయం అందరికీ తెలుసు కాబట్టే. పవన్ స్టాండ్ ఎంతమాత్రం నమ్మదగ్గది కాదని జనాలు, పార్టీలు అనుకున్నాయేమో.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమే తీసుకుంటే పవన్ నిలదీయాల్సిందెవరిని ? పవన్ తప్పుపట్టాల్సింది ఎవరిని ? పవన్ పోరాటం చేయాల్సిందెవరిపైన ? ఈ ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలుసు.
స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానిది. తన ఫ్యాక్టరీని తాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణ పై ఏమైనా అభ్యంతరాలుంటే తప్పుపట్టాల్సింది, నిలదీయాల్సింది, పోరాటం చేయాల్సింది కేంద్రానికి వ్యతిరేకంగా. కానీ పవన్ తప్పుపడుతున్నది, నిలదీస్తున్నది, పోరాటం చేస్తున్నది రాష్ట్రప్రభుత్వంపైన.
అంటే నరేంద్రమోడిని నిలదీయాల్సిన, మోడీపై పోరాటం చేయాల్సిన పవన్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఇక్కడే పవన్ చిత్తుశుద్ది ఏమిటో జనాలందరికీ అర్ధమైపోయింది. ఇదే విషయాన్ని గతంలో వైజాగ్ లో దీక్షలు చేస్తున్న ఉద్యమకారులు కూడా చెప్పారు.
తప్పంతా కేంద్రానిదైతే రాష్ట్రాన్ని నిందించటం లో ఉద్దేశ్యమేమిటని పవన్ను కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నించారు. అయినా పవన్ తన పద్దతిని మార్చుకోవటంలేదు.
నిజంగానే పవన్ గనుక తన పోరాటాన్ని కేంద్రప్రభుత్వం పైన, మోడీకి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు జనాలు వెంట నిలబడతారేమో. మోడీని ఎదిరించలేని పవన్ వెంట జనాలు ఎవరుంటారు ? ఎందుకుండాలి ? అందుకనే ఎవరు పవన్ వెంట ఉండటంలేదు. ఇందుకనే పవన్ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందని చెప్పింది.