మరో ఆసక్తికర అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు రహస్యంగా భేటీ కానున్నారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ జరిగే సదస్సులో పాల్గొనేందుకు ప్రయాణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే.
దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లని దావోస్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు తన టూర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. పెట్టుబడులతో పాటు.. పలువురు ప్రముఖుల్ని దావోస్ సదస్సు సందర్భంగా భేటీ కానున్నారు. అలాంటి ప్రముఖుల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పాటు.. పలువురు విదేశీ ప్రతినిధులు ఉన్నారు.
దావోస్ సదస్సు మీద ఎన్నో ఆశలతో ఉన్న చంద్రబాబు.. తిరిగి వచ్చే సమయంలో సింగపూర్ లో ఆగనున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో ఆయన మరో ముఖ్యమైన మీటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఈ భేటీ ఉంటుందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ సింగపూర్ వెళుతున్నారు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి . ఈ నేపథ్యంలో వీరి మధ్య భేటీ జరగనుందని రాజకీయ ఊహ గానాలు మొదలయ్యాయి .
వీరిద్దరి మధ్య భేటీకి విపరీతమైన ప్రాధాన్యత వస్తుండటం.. లేనిపోని ఊహాగానాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. అందుకు భిన్నంగా బాబు.. పవన్ లు సింగపూర్ లో గుట్టుచప్పుడు కాకుండా కలుసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు.. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలతో పాటు మరిన్ని రాజకీయ అంశాల మీద విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.