పవన్ - లోకేష్ లు ఒకే మాట.. ఓడించడానికే!

Update: 2019-04-04 04:44 GMT
ఒకవైపు తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని అంటున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తనను ఓడించడానికి ప్రత్యర్థులు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని పవన్ అంటున్నారు. అయితే సదరు ప్రత్యర్థులు  ఏ పార్టీ వారో పవన్ కల్యాణ్ చెప్పలేదు. లెక్క ప్రకారం  అయితే పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతున్నట్టే. మరి తనను ఓడించడానికి ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారో పవన్ కల్యాణ్ చెప్పలేదు. తనను ఓడించడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారని, తను ఎమ్మెల్యేగా నెగ్గి  తీరడం గ్యారెంటీ  అని పవన్ కల్యాణ్ ఛాలెంజ్ చేశారు.

ఇక పవన్ లాగే మాట్లాడారు నారా లోకేష్ బాబు. తనను మంగళగిరిలో ఓడించేందుకు కుట్ర జరుగుతోందని నారా లోకేష్ అన్నారు. అయితే లోకేష్ తన ప్రత్యర్థులపై ఆర్థిక పరమైన ఆరోపణలు ఏవీ చేయలేదు. తనను ఓడించడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారని లోకేష్ అనలేదు. అయితే తనను ఓడించడానికి అద్దె తారలను దించుతున్నారని లోకేష్ బాబు వ్యాఖ్యానించారు.

తన ఓటమికి కుట్ర జరుగుతోందని లోకేష్  బాబు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ అన్నారు. తను మంగళగిరి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని లోకేష్ చెప్పుకొచ్చారు. మంగళగిరి ప్రజలకు ఏ అవసరం వచ్చినా తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని  లోకేష్ అన్నారు.


Tags:    

Similar News