జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సినిమా షూటింగ్ లో ఊపిరి సలపనంత పనిలో ఉన్నట్లుగా ఆ మధ్య చెప్పిన పవన్.. తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన అంబటి రాంబాబు ఇంట జరిగిన పెళ్లికి హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే పవన్.. అదే జగన్ కు క్లోజ్ అయిన అంబటి పెళ్లికి వెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి ఇంట పెళ్లికి వెళ్లటం ద్వారా.. పవన్ పలు విషయాలపై స్పష్టత ఇచ్చినట్లుగా చెబుతుందటం గమనార్హం. తనకు అన్ని పార్టీల్లోనూ సన్నిహితులు ఉన్న విషయాన్ని పవన్ స్పష్టం చేయటంతో పాటు.. టీడీపీ.. బీజేపీ నేతలే కాదు.. తాను ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ చేయగలనన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో తుని ఇష్యూలో కాపు నేతల ఆగ్రహానికి గురైన పవన్.. దాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి ఇంట జరిగిన పెళ్లికి ప్రత్యేకంగా హాజరయ్యారని చెబుతున్నారు. వేడుకలకు కాస్త దూరంగా ఉండే పవన్.. ప్రత్యేకించి అంబటి ఇంట పెళ్లికి రావటమే కాదు.. వధూవరులను ఆశ్వీరదించటం.. పెళ్లి వేడుక దగ్గర కాసేపు గడపటం అందరి దృష్టిని ఆకర్షించింది.