జనసేనానికి ఓ కొత్త ప్రచారం రథం సిద్ధమవుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పోల్చితే.. జనసేనాని పవన్ కు కాస్తా ఆర్థిక అండదండలు స్వల్పమే.. ఆ పార్టీలోకి ఇంకా పెద్ద తలకాయలు రాకపోవడం.. పవన్ ఒంటరిగా ముందుకెళ్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటివరకు తన పర్యటనల్లో పవన్ సరైన సౌకర్యాలు సమకూర్చుకోలేకపోయారు. మొన్నటి ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ ఓ కారులో ప్రయాణిస్తూ ప్రచారం చేశారు. ఎక్కడ బస దొరికితే అక్కడే రాత్రిళ్లు గడిపాడు.
జనసేనాని పర్యటనల వ్యయప్రయాసలు చూసిన అతడి మిత్రుడు - టీవీ99 యజమాని తోట చంద్రశేఖర్ ఇప్పుడు పవన్ కోసం ఓ ఖరీదైన ప్రచారరథాన్ని సిద్ధం చేయిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందట.. ప్రస్తుతం ఏపీలో అధికార టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలున్న వాహనం ఉంది. ఇప్పుడు పవన్ కు కూడా అలాంటిదే ఇసుజి కంపెనీ వాహనం రెడీ అవుతోంది.
పవన్ కోసం సిద్ధం చేస్తున్న ఈ వాహనానికి తెలుపు రంగు వేశారు. పవన్ నమస్కరిస్తున్న ఫొటోతో పాటు జనసేన సిద్ధాంతాలను బస్సు పై రాయించారు. ఇందులో సకల సౌకర్యాలు ఉన్నాయట.. ప్రముఖులతో సమావేశాలకు హాలు, విశ్రాంతికి ఓ బెడ్ - టీవీ - ఇంటర్నెట్ ను ఇందులో పొందుపరిచారట.. రాబోయే రోజుల్లో పవన్ ఇక ఈ వాహనం నుంచే ప్రచారం చేస్తారని.. రాత్రిళ్లు ఇందులోనే విశ్రాంతి తీసుకుంటారని జనసేన నాయకులు చెబుతున్నారు.