పవన్ మరింత దూకుడుగా.. జగన్ కోర్టులోనే బంతి...?

Update: 2023-07-01 09:20 GMT
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జగన్ మీదనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయన 2014 నుంచి అదే ధోరణిలో ఉంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా జగన్ మీదనే పవన్ ఆనాడూ గురి పెట్టేవారు. ఇపుడు ఎటూ సీఎం గా ఉన్నారు కాబట్టి విపక్ష నేతగా పవన్ చేయాల్సిందే చేస్తున్నారు.

అయితే ఇది కాస్తా రెండు రాజకీయ పార్టీలు ఇద్దరు నాయకులు అన్న హద్దులను దాటి ఎక్కడికో కధ వెళ్లిపోతోంది. పవన్ విషయంలో జగన్ ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కురుపాం సభలో అయితే జగన్ పవన్ మీద విమర్శల డోస్ పెంచారు.

దానికి ఇమీడియట్ రియాక్షన్ పవన్ అపుడే ఇచ్చారు. ఇపుడు అయితే ఏకంగా భీమవరం సభలో విశ్వరూపం చూపించారు. డైరెక్ట్ అటాక్ అంటూ ఇది వార్నింగే  అనుకో అంటూ పవన్ విసిరిన సవాళ్ళు కానీ పేల్చిన మాటల తూటాలు కానీ ఏపీలో జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్ లో సరికొత్త అంశాన్నే చూస్తున్నట్లుగా అనిపించేసింది.

ఇద్దరు నేతలూ రాజకీయాలు దాటేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగిపోతున్నారు. పవన్ పెళ్ళిళ్ళ విషయం జగన్ ఎత్తితే హైదరాబాద్ అడ్డగా చేసుకుని జగన్ ఏమేమి చేశారో తనకు అంతా తెలుసు అని ఈ రోజుకీ జగన్ గురించి క్షణక్షణం తాను తెలుసుకుని ఉన్నానని అంటున్నారు. ఆ గుట్టు విప్పేదా అని కూడా అడుగుతున్నారు.

జగన్ వ్యక్తిగత విషయాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని పవన్ అంటున్నారు. వాటిని బయటపెడతాను అంటున్నారు. ఒక విధంగా పవన్ జగన్ తో అమీ తుమీ అంటున్నారు. ఎందాకైనా అంటున్నారు. మీకు ఫ్రాక్షనిజం, రౌడీయిజం వచ్చు అని ఎగిరెగిరి పడితే నేను ఇక్కడ చూస్తూ ఊరుకోను అని పవన్ అంటున్నారు. జగన్ చిన్నపుడే పోలీసులను కొట్టారని, అలాంటి వ్యక్తి ఏపీకి సీఎం గా ఉండడమా కానే కాదు కుదరదు అని పవన్ అంటున్నారు.

ఇవన్నీ సరే కానీ జగన్ నీ మనిషిని పంపు అతని చెవుల్లో రక్తం కారేలా పచ్చి నిజాలు చెబుతాను అని పవన్ అంటున్నారు. ఏమిటా నిజాలు జగన్ గురించి అన్ని సీక్రేట్స్ ఏమి ఉన్నాయి. అవి పవన్ కి ఎలా తెలుసు. ఇదే ఇపుడు హాట్ టాపిక్. ఒక సీఎం ని పట్టుకుని నీ వ్యక్తిగత విషయాలు నాకు తెలుసు. చెబుతా చూసుకుందామని ఇప్పటిదాకా సవాల్ చేసిన రాజకీయం ఏ రాష్ట్రంలోనూ లేదు.

ఏపీలోనే అది కనిపిస్తోంది. చూస్తే జగన్ పట్టుదల ఎంతో అందరికీ బాగానే అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటున్నారు. ఈ ఇద్దరు రాజకీయాలు కాస్తా ఏపీలో హై ఓల్టేజ్ పాలిటిక్స్ ని క్రియేట్ చేస్తున్నాయా అన్నదే చర్చగా ఉంది. ఇక జగన్ కోర్టులోనే పవన్ బంతి వేశారు. నేను నిండా మునిగాను, నాకు చలేముంది అంటున్నారు.

బస్తీ మే సవాల్ అంటున్నారు. తేల్చుకుందామని అంటున్నారు. అలా బంతిని జగన్ కోర్టులో వేశారు. మరి పవన్ తో తేల్చుకోవాలని అనుకున్నా ఆయన చెప్పే సీక్రేట్స్ ఏంటి అన్నది పక్కన పెట్టి జగన్ ముందుకు వస్తారా పవన్ విషయంలో జగన్ నేరుగా ఢీ కొడతారా అన్నది చూడాలి. మరో వైపు చూస్తే జగన్ తో డైరెక్ట్ గా ఢీ కొట్టడం ద్వారా పవన్ ఏపీకి తానే ఆల్టర్నేటివ్ లీడర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వ్యూహం అయితే దాగుంది. మరి పవన్ వ్యూహానికి జగన్ పడతారా. నేరుగా పవన్ గీసిన ముగ్గులోకి వస్తారా అన్నదే చూడాల్సి ఉంది.

Similar News