టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మీద పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి.. ఈ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన శ్రీరెడ్డి తనను క్షమించాలని కోరారు. తాను పవన్ ను.. పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేశానని తాను వారికి భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఒక టీవీ ఛానల్లో చర్చలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీరెడ్డిని పవన్ ఫ్యాన్స్ కొందరు ఛానల్ ఎదుట చేరటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. టీవీ ఛానల్ నుంచి బయటకు వచ్చిన ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పవన్ ఫ్యాన్స్ వెంబడించిన వైనం కలకలాన్ని రేపింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎంట్రీ అయి.. పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె వాహనాన్ని పవన్ ఫ్యాన్స్ వెంటాడుతున్న నేపథ్యంలో ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కాసేపు కూర్చోబెట్టి మరో పోలీస్ వాహనంలో ఆమెను ఇంటికి చేర్చారు. శ్రీరెడ్డిని వెంటాడిన పవన్ ఫ్యాన్స్ లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించి.. మందలించి వదిలిపెట్టినట్లుగా తెలుస్తోంది.