సుదీర్ఘకాలం ప్రజలకు దూరంగా ఉండటం.. ఒక్కసారిగా ప్రజల్లోకి రావటం.. కాస్తంత హడావుడి చేయటం.. మళ్లీ కొంతకాలం సినిమాల్లో మునిగిపోవటం లాంటివి జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు అలవాటే. నిన్న విశాఖపట్నం.. నేడు పోలవరం.. రాజమహేంద్రవరం లలో పర్యటిస్తున్న పవన్.. పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.
నిన్న విశాఖలో ఏ విధంగా అయితే తన ప్రసంగాన్ని వినిపించారో..ఇంచుమించు అదే తీరుతో మరోసారి తన వ్యాఖ్యల పరంపరను ఈ రోజూ కొనసాగించారు.
నిన్నటికి నిన్న పరకాల ప్రభాకర్ కు భారీ పంచ్ వేసిన పవన్.. ఈ రోజూ అదే వేడిని కొనసాగించారు. ప్రత్యేక హోదా అంశాన్ని తాను ఒక్కడిని మాత్రమే ప్రస్తావించాలా? అని క్వశ్చన్ చేసిన పవన్.. పరకాల ప్రభాకర్.. నిర్మలా సీతారామన్ ఎందుకు దానిపై మాట్లాడటం లేదని.. రాజకీయాల్లో తానింకా చిన్నపిల్లాడినేనన్నారు.
ప్రజారాజ్యంలో గుర్తింపు ఇవ్వలేదని చిరంజీవిని కస్సున లేచిన పరకాల ప్రభాకర్.. ఇప్పుడు పాము పడగ ఎందుకు విప్పటం లేదని.. పరకాల లాంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదన్నారు. బలమైన వ్యక్తులపై సూటి విమర్శలు చేయకుండా పరకాల లాంటి వారిపై పవన్ పంచ్ లు వేస్తున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.