రాపాక - లక్ష్మీనారాయణ బండారం బయటపెట్టిన పవన్

Update: 2020-02-02 07:04 GMT
జనసేన పార్టీలోనే ఉంటూ అసమ్మతి రాజేస్తున్న పార్టీ ఎమ్మెల్యే రాపాక ఒకవైపు.. జనసేనకు గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తిపోసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరు మరో వైపు.. ఈ ఇద్దరి బండారాన్ని  ఒకేసారి బయటపెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాన్. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమీక్ష సందర్భంగా పవన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో ఉన్నారో లేదో తనకు తెలియదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాపలా రాజకీయాలు చేయలేనని.. ఎవరైనా నేతలు ఇష్టంతో పార్టీలో ఉండాలి కానీ.. బలవంతంగా ఉండాలని చెప్పేది లేదని పవన్ కుండబద్దలు కొట్టారు.

ఇక తన తీరును నిరసిస్తూ ఇటీవలే పార్టీని వీడిన లక్ష్మీనారాయణ గురించి కూడా పవన్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడు సీటు కోసం చివరి నిమిషంలో తమ వద్దకు వచ్చి.. ఇప్పుడు తన విధానాలు బాగా లేదని చెప్పి వెళ్లిపోయేవారి గురించి స్పందించాల్సిన అవసరం లేదని పవన్ తాజాగా లక్ష్మీనారాయణ వైఖరిని తూర్పారపట్టారు. భవిష్యత్తులో మనల్ని ఇష్టపడే వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారని పవన్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News