బాబు దీక్ష‌ను ప‌వ‌న్ హైజాక్ చేశాడే!

Update: 2018-04-20 14:07 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష‌ పేరిట శుక్రవారం విజయవాడలో ఒక్కపూట దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ధ‌ర్మ దీక్ష‌కు దాదాపుగా రూ.30 కోట్లకు పైగా ప్రజాధనాన్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుపెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఓ భారీ ఈవెంట్ ను త‌ల‌పించే రీతిలో బాబుగారు చేప‌ట్టిన ఈ దీక్ష‌కు ఈ స్థాయిలో నిధుల దుర్వినియోగంపై స‌ర్వ‌త్రా నిరసన వ్యక్తమవుతోంది. గౌర‌వ ముఖ్య‌మంత్రిగారి దీక్ష‌కు మ‌ద్ద‌తుగా 175 నియెాజక వర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల దీక్షల కొసం మ‌రో 11.5 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం విడుద‌లైన‌ట్లు వినికిడి.  ప్ర‌భుత్వ సొమ్ముతో పార్టీకి క్రెడిట్ వ‌చ్చేలా జ‌రిపిన ఈ ప‌న్నాగానికి తెలుగు త‌మ్ముళ్లు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ దీక్ష‌ను క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌భుత్వ అనుకూల మీడియా సంస్థ‌లు నిన్న‌టి నుంచి తెగ హ‌డావిడి కూడా చేశాయి. అయితే, ఇంత ఖ‌ర్చు పెట్టి దీక్ష చేప‌ట్టిన బాబుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క గంట‌లో షాక్ ఇచ్చాడు.

అర్ధ‌రాత్రి ప‌వ‌న్ ఇచ్చిన షాక్ రాష్ట్ర రాజ‌కీయం కొత్త మ‌లుపు తీసుకుంది. వ‌రుస ట్వీట్ల‌తో, సాక్ష్యాధారాల‌తో బాబు మీడియా బ‌ట్ట‌లు విప్పేశాడు ప‌వ‌న్. అంత‌టితో ఆప‌కుండా పొద్దున్నే  ఫిలిం చాంబ‌ర్ వ‌ద్ద ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో మీడియా అటెన్ష‌న్ అంతా అటువైపు మ‌ళ్లింది. దీంతో, బాబు దీక్ష‌ను వీక్షించేవారు క‌రువైపోయారు. అస‌లు మీడియాకు కొత్త హాట్ అంశాలు దొరికాయి.

త‌న‌పై వ‌ర్మ వ్యాఖ్య‌ల వెనుక కొంత‌మంది మీడియా చానెళ్లున్నాయ‌ని, లోకేష్ దానికి సూత్ర‌ధారి అని ప‌వ‌న్ బ‌హిరంగంగానే ట్వీట్ చేశారు. ప్ర‌త్యేకించి ఎల్లో మీడియా త‌న‌ను టార్గెట్ చేసింద‌ని కూడా చెప్పారు. అంతేకాకుండా, దాదాపు 5 గంట‌ల పాటు ఫిల్మ్ చాంబ‌ర్లో ప‌వ‌న్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం ల్యాండ్ అయింది. దీంతో, బాబు దీక్ష‌కు అనుకున్న క‌వ‌రేజీ ...దాంతో వ‌స్తుంద‌నుకున్న మైలేజీ రాలేదు. ఏదో బాబుకు ఎల్ల‌పుడూ ద‌న్నుగా నిలిచే ఒక‌ట్రెండు మీడియా చానెళ్లు మాత్రం దీక్ష‌ను `క‌వ‌ర్` చేశాయి.  

ఓ మాట‌లో తాను చేసిన అన్యాయాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ప్ర‌భుత్వ సొమ్ముతో చేపట్టిన భారీ ప‌బ్లిసిటీ ప్రాజెక్టును, రాజ‌కీయ ప్ర‌యోజిత కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ ప‌టాపంచ‌లు చేశారు. అంతేకాదు ఇంత‌కాలం న్యూట్ర‌ల్ అని ముసుగేసుకున్న కొంద‌రి బండారాన్ని బ‌య‌ట‌పెట్టి వారి స్వ‌యంనిర్మిత క్రెడిబులిటీని కూడా దెబ్బ‌కొట్టాడు ప‌వ‌న్‌. మొత్తానికి ప‌వ‌న్ కు స‌రైన టైంలో స‌రైన చాన్స్ దొరికి, క‌రెక్ట్ టైం కి ప‌వ‌న్ రియాక్ట్ కావ‌డంతో ఎల్లో బ్యాచ్ అంతా బాగా డిజ‌ప్పాయింట్ అయ్యారు. మొత్తానికి టీడీపీ, చంద్ర‌బాబు ల‌కు వ్రతము  చెడింది...ఫ‌లితమూ ద‌క్క‌లేదు...అన్న‌ట్ల‌యింది ప‌రిస్థితి. ఒక్క మాట‌లో చెప్పాలంటే `ధ‌ర్మ‌దీక్ష‌`ను ప‌వ‌న్ హైజాక్ చేసిన‌ట్లే!
Tags:    

Similar News