జనసేనాని వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో రెండు చోట్ల పోటీ చేశారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారు, ఏ సీటు వైపు ఆయన చూపు ఉంది అన్న ప్రశ్నలు పార్టీ లోపలా బయటా ఉన్నాయి. ఇపుడు దానికి తోడు అన్నట్లుగా మరో విషయం బయటకు వస్తోంది. అదేంటి అంటే పవన్ ఎంపీగా పోటీ చేస్తారా అని.
ఇది చాలా ఇంటరెస్టింగ్ మ్యాటర్ గానే చూడాలి. పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. అలాంటి నాయకుడు ఎంపీగా పోటీ చేస్తే ఇక తన సీఎం ఆశలను వదులుకున్నట్లేనా అన్నదే ఆ చర్చ. అయితే రాజకీయ వ్యూహం ఉంటే తప్ప పవన్ ఇలాంటి డెసిషన్ తీసుకోరు అని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే పవన్ ఎంపీగానూ ఎమ్మెల్యేగానూ రెండింటా పోటీకి దిగుతారు అని.
మరి అదే నిజమైతే ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి, ఎంపీగా ఏ సీటు నుంచి పోటీ పడతారు అన్నది మరో చర్చ. కోస్తాంధ్రాలో జనసేనకు బలం బాగా ఉంది అని అంతా చెబుతున్నారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా కోస్తా జిల్లాల నుంచి అలాగే ఎంపీగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. అనంతపురం అంటే రాయలసీమ ప్రాంతం. అక్కడ జనసేన బలం తక్కువగా ఉంటుంది. పైగా అది హార్డ్ కోర్ రీజియన్ గా వైసీపీకి చెబుతారు.
మరి అలాంటి చోట ఎంపీగా పోటీ అంటే ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా పవన్ బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది జరిగేనా అంటే ఇక్కడ కూడా రాజకీయ లెక్కలు అన్నీ చూసుకుని పొత్తుల వీలు వాలూ చూసుకుని పవన్ ఈ డెసిషన్ కి వచ్చారు అని అంటున్నారు. ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బీ అని కూడా డిసైడ్ చేసుకుని మరీ ఈ ఎంపీ సీటు విషయంలో ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ప్లాన్ ఏ ప్రకారం చూస్తే బీజేపీ జనసేన టీడీపీల మధ్య పొత్తు అన్న మాట.
అంటే ఇది 2014 ఎన్నికల పొత్తుని రిపీట్ చేస్తుంది. అలా అయితే ఏపీలో అధికారం గ్యారంటీగా వస్తుంది. అపుడు కూటమి తరఫున చంద్రబాబు తో పాటు పవన్ కూడా సీఎం రేసులో ఉంటారు. దాంతో అపుడు పవన్ కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు. అది కూడా తాను కోరుకున్న కోస్తా జిల్లాల నుంచే బరిలో ఉంటారు అని చెబుతున్నారు. అలా కాకుండా ప్లాన్ బీ ని తీసుకుంటే ఎలా అన్నది మరో చర్చ. ప్లాన్ బీలో కేవలం టీడీపీ జనసేనల మధ్య మాత్రమే పొత్తు ఉంటుంది.
అపుడు పవన్ ఎమ్మెల్యే ఎంపీగా కూడా పోటీ చేస్తారు అంటున్నారు. అది ఎందుకు అంటే ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వస్తే బాబు సీఎం అవుతారు. అపుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా నెగ్గి కేంద్రంలో మూడవసారి ఏర్పాటు అవబోయే బీజేపీ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రిగా ఉండేందుకు ఎంపీ పోటీ అని అంటున్నారు. అయితే అపుడు కూడా ఆయన ఎమ్మెల్యేకూ పోటీ చేస్తారు. అయితే టీడీపీ జనసేనల మధ్య అధికార ఒప్పందం కుదిరి చెరి సగం కాలం సీఎం పదవిని పంచుకోవాలని అనుకుంటే అపుడు ఎమ్మెల్యేగానే కంటిన్యూ అయి ఎంపీకి రిజైన్ చేస్తారు.
అలా కాదు బాబు అయిదేళ్ల సీఎం అనుకుంటే అపుడు పవన్ ఎంపీగా ఉంటూ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే పవన్ చాలా ముందు చూపుతో ప్లాన్ రూపిందిస్తున్నారు అనుకోవాలి. ఈ రెండు ప్లాన్స్ లో ఏదో ఒక దానికి ఆయన కట్టుబడే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్లాన్ బీకే ఆయన మొగ్గు చూపుతారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలన్న కసితో ఉన్న పవన్ కి టీడీపీతో కలిస్తే తప్ప ఆ లక్ష్యం నెరవేరదు అన్నది బాగా తెలుసు.
అందుకే పవన్ ఎంపీగా ఆప్షన్ పెట్టుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఎంపీగా పవన్ పోటీ చేస్తే మాత్రం ఏపీలో చంద్రబాబుకు సీఎం సీటుకు ఎలాంటి పోటీ ఉండదని చెప్పేసినట్లే. అదే టైంలో వైసీపీని ఓడించడానికి గట్టి రూట్ పడిపోయినట్లే. సో పవన్ మార్క్ పాలిటిక్స్ తో టీడీపీ జనసేనల మధ్య పొత్తులు కుదరడం ఖాయమనుకున్నా అది జనసేన క్యాడర్ కి ఎంత వరకూ ఇష్టం అవుతుంది అన్నది చూడాలని అంటున్నారు. సీఎం సీఎం అని పవన్ని పిలుచుకున్న వారు ఆయన ఏపీ రాజకీయాలను వదిలిపెడతారు అంటే ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఎలా చూస్తారు అన్నదే కీలకమైన ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.