ఒక చిత్రమైన సన్నివేశానికి రామోజీ ఫిలింసిటీ వేదిక కానుంది. మీడియా మొఘల్ రామోజీ ఇంట సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న మొదటి పెళ్లి వేడుకకు సంబంధించి వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాజకీయ.. సినిమా.. వ్యాపార వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రామోజీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీల జాబితా చాంతాండంత ఉంటుందని చెప్పక తప్పదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులు ఉన్నప్పటికీ.. రామోజీ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఆయనకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా నెట్ వర్క్.. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సంబంధాలు.. మీడియా వ్యాపారాలు లాంటి వాటి కారణంగా రామోజీ మనమరాలి వివాహానికి భారీ ఎత్తున ప్రముఖులు.. సెలబ్రిటీలు.. హాజరు కానున్నట్లుగా చెబుతున్నారు.
ఇంత మంది ప్రముఖులు ఒక చోటకు రావటం ఒక ఎత్తు అయితే.. చిత్ర విచిత్రమైన కాంబినేషన్లలో అతిధులు రామోజీ ఇంట జరుగుతున్న పెళ్లికి వస్తారని తెలుస్తోంది. సహజంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఒకేచోట వచ్చే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే.. ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరు చంద్రుళ్ల కుమారులు.. రాష్ట్ర గవర్నర్ తో పాటు.. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రులు.. పలు రాష్ట్రాల మంత్రులతో పాటు.. పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. పారిశ్రామికవేత్తలు.. ఇలా అందరూ కలిసే వేదిక దాదాపుగా ఉండి ఉండదనటంలో సందేహం లేదు.
అలాంటి విచిత్రమైన కాంబినేషన్లకు వేదికగా రామోజీరావు మనమరాలి పెళ్లి వేదిక కానుందని చెప్పాలి. ఇక.. పెళ్లి విషయానికి వస్తే.. 28వ తేదీ అర్థరాత్రి పన్నెండు గంటలకు మేష లగ్నంలో జరగనుంది. అంతకు కొద్ది గంటల ముందే పెళ్లి రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం రామోజీ ఫిలింసిటీలో పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.