పవన్ టార్గెట్ వారే... ప్లాన్ అదుర్స్...?

Update: 2022-02-12 01:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటు దేలారు అనుకోవాలి. ఆయన గతానికి భిన్నంగా పాయింట్ టూ పాయింట్ సెలెక్ట్ చేసుకుని మరీ  మాట్లాడుతున్నారు. ఒక పర్టిక్యులర్ సెక్షన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. దాని వల్ల ప్రభుత్వంతో పోరాటం చేసినా ప్రయోజనం ఉంటుంది. ఫ్యూచర్ లో వారు అంతా పవన్ కి దన్నుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఇపుడు పవన్ ఏపీలోని విపక్ష నేతల్లో ముందంజలో ఉన్నారనే చెప్పాలి.

స్వతహాగానే పవన్ అంటేనే యూత్ ఐకాన్. ఆయన వెంట పెద్ద ఎత్తున యువత ఉంటారు. ఇపుడు వారినే తన సైనికులుగా చేసుకుని పవన్ రాజకీయాలను జోరెత్తిస్తున్నారు. ఏపీలో లక్షలలో నిరుద్యోగులు ఉన్నారు. వారంతా గత మూడేళ్లుగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరో వైపు చూస్తే జగన్ పాదయాత్ర వేళ భారీ హామీలే ఇచ్చారు.

ప్రతీ ఏడాది జనవరి ఒకటవ తేదీ వచ్చేసరికి ఠంచనుగా జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామని, లక్షలలో  ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే మెగా డీఎస్సీని కూడా నిర్వహిస్తామని అన్నారు. ఇపుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ లో ఉంది. టీచర్ ఉద్యోగాలు అన్నారు, పోలీసుల పోస్టులు అన్నారు, ఇపుడేవీ అని జగన్ని గట్టిగానే పవన్ నిలదీశారు.

ఏపీలో ఉపాధి కల్పన అంటే తన చుట్టూ సలహాదారులను పెద్ద ఎత్తున నియమించుకోవడం అనే జగన్ అనుకుంటున్నారా అని పవన్ వేసిన సెటైర్లు కూడా బాగా పేలుతున్నాయి. ఇక ముప్పయి లక్షల మంది నిరుద్యోగులు ఏపీలో ఉన్నారని, వారందరికీ భవిష్యత్తు లేక అంధకారంలో ఉన్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా వైసీపీకి ఇబ్బంది పెట్టే పరిణామమే.

రెండేళ్ల తరువాత కేవలం పది వేల పోస్టులతో జాబ్ లెస్ క్యాలండర్ వేసి చేతులు దులుపుకున్నారని పవన్ దుయ్యబెడుతున్నారు. ఒక విధంగా ఏపీలోని లక్షల్లో యువత నిరుత్సాహం గా ఉంది. అలాంటి యువతకు అండగా ఉంటూ పవన్ సంధిస్తున్న అస్త్రం జగన్ సర్కార్ ని వణికించేదే. ఇదే యువత ఆశపడితేనే జగన్ కి 151 సీట్లు వచ్చాయని జనసేన నేతలు అంటున్నారు. మరి వారి మద్దతు ఇపుడు లేదని, రేపటి ఎన్నికల్లో వారి ఆగ్రహం కూడా చవి చూస్తారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ సరైన సమయంలో అతి పెద్ద వర్గానికి చేరువ అవుతున్నారు. యువతతోనే రేపటి ఏపీ రాజకీయాన్ని మార్చాలని అనుకుంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ మార్క్ పాలిటిక్స్ తో జగన్ సర్కార్ కి రానున్న రోజుల్లో కలవరపాటు తప్పదా అంటే అవును అనే జవాబు వస్తోందిట. చూడాలి మరి.
Tags:    

Similar News