అలీ గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. చంద్రబాబు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీంతో.. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్న అలీ.. గుంటూరు తూర్పు నుంచి కచ్చితంగా గెలవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే తన మనుషుల్ని నియోజకవర్గానికి కూడా పంపించేశాడు. అయితే.. ఎంతమంది ఉన్నా.. అలీకి పవన్ కల్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరు. జనం కుప్పలు తెప్పులుగా వస్తారు. అన్నింటికి మించి జనసేనకు గుంటూరు జిల్లాలో మాంచి పట్టుంది. పవన్ ఫేస్ వేల్యూకి చాలా ఓట్లు పడతాయి. అయితే రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్న పవన్.. అలీ కోసం ప్రచారానికి వస్తాడా అనేదే డౌట్.
అలీ అంటే పవన్ కు చాలా ఇష్ట. అలీ తన గుండెకాయ అని ఓ ఇంటర్యూలో కూడా చెప్పాడు. అలాగని అలీ కోసం ప్రచారానికి వస్తే.. జనసేన టీడీపీతో కలిసిపోయిందని పుకార్లు పుట్టిస్తారు. దీంతో.. అలీ వ్యక్తిగతంగా వచ్చి పవన్ కల్యాణ్ ని అడిగినా ప్రచారానికి రాకపోవచ్చు. అయితే.. తన స్నేహితుడు అయిన అలీ కోసం ఒక పని మాత్రం కచ్చితంగా చేస్తాడు. గుంటూరు తూర్పులో తన పార్టీ తరపు నుంచి అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. ఒకవేళ నిలబెట్టిన గట్టి క్యాండిడేట్ కు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ ఒక్క సాయం అయితే అలీ కోసం పవన్ కచ్చితంగా చేయగలడు. మరి పవన్ అలీ కోసం ఏదైనా చేస్తాడా లేదా.. కచ్చితంగా ఈ సీటు గెలవాలని బలమైన అభ్యర్థిని పెడతాడో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే మరి.