ఇప్పటివరకు ఏపీలో రెండే రెండు ప్రభుత్వాలు. అయితే కాంగ్రెస్ లేదంటే టీడీపీ. వేరే పార్టీ అధికారంలోకి రాలేదు.అయితే ఏ పార్టీ వచ్చినా పథకాలు పేర్లు మారిపోతాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ - రాజీవ్ పేరు. అదే టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు పేరు కూడా యాడ్ అయ్యింది. ఎన్టీఆర్ సుజల స్రవంతి - అన్న క్యాంటీన్ - చంద్రన్న బీమా.. ఇలా పథకాలన్నింటికి టీడీపీ పేర్లని ఫిక్స్ చేసేసేంది
పథకాలకు - ప్రాజెక్టులకు ఇలా పార్టీలకు చెందిన వారి పేర్లను పెట్టడంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యాడు. మన రాష్ట్రానికి ఎంతోమంది సేవ చేశారని.. వారందరి పేర్లు పెట్టకుండా.. అసలు మనకు సంబంధమే లేని ఇందిర - రాజీవ్ గాంధీ పేర్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ లేదా చంద్రబాబు పేర్లు పెట్టడానికే ఆసక్తి చూపిస్తుందని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పేర్లు ఎందుకు గుర్తుకురావడం లేదని ప్రశ్నించారు. తన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ బీమా పథకం లాంటి పేర్లు ఉండవని.. తెలుగు జాతి కోసం పోరాడని మహనీయుల పేర్లే పెడతానని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు తమ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.