కొందరికి కొన్ని కలిసి రావంటారు. నాస్తికవాదులైతే ఇలాంటి వాటిని కొట్టిపారేస్తుంటారు. నమ్మకాలున్నోళ్లు మాత్రం ఇలాంటి వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. పవర్ స్టార్ గా సుపరిచితులు.. జనసేన అధినేతగా రూపాంతరం చెందిన పవన్ కల్యాణ్ కు మొదట్నించి ఇంటి వ్యవహారం అచ్చిరాదన్నట్లుగా ఉంటుంది.
ఆయన ఇంటి విషయం ఎప్పుడూ పెద్ద వార్తే. సినిమాల్లో చిరు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ వ్యక్తిగత జీవితం పెద్దగా బయటకు రాలేదు. ఇంట్రావర్ట్ గా అభివర్ణించే పవన్ మీడియాతో సన్నిహితంగా ఉండటం.. అప్పటికే మిగిలిన వారు అనుసరించే దారిని వదిలేసి తన దారిన తాను నడవటం అప్పట్లో చాలామంది మీడియా మిత్రులకు మింగుడుపడని రీతిలో ఉండేదని చెబుతారు.
ఇదే పవన్ పై నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయ్యేలా చేసిందన్న వాదన ఉంది. మొయిన్ స్ట్రీమ్ మీడియాలో పవన్ ముచ్చట పెద్దగా రాకున్నా.. ఆయన మీద పలు కథనాలు ఇండస్ట్రీలోనూ.. జనాల్లోనూ వినిపించేవి. ఇలాంటి సమయంలోనే ఆయన మొదటి ఇంటి కథ బయటకు వచ్చింది. పవన్ కు అప్పటికే పెళ్లి అయ్యిందని.. వారిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తోందని. అంటే.. అప్పటికే వారిద్దరూ విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది. అది నిజమో కాదో తెలీని పరిస్థితి. పవన్ ఇష్యూ ఆయన కాకుండా ఎవరూ మాట్లాడరు. ఆయనేమో మీడియాకు దూరంగా ఉండేవారు.
ఇలా జోరుగా సాగిన ప్రచారం తర్వాతి కాలంలో ఆయన విశాఖలో విడాకులు తీసుకున్నారన్న అధికారిక సమాచారంతో ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పడింది.
ఇది జరిగిన కొన్నాళ్లకు తన అన్న చిరు ఇంటి దగ్గర స్థలం విషయంలో పరిటాల రవితో గొడవైందని.. పవన్ ను కిడ్నాప్ చేసి.. గుండు కొట్టించారన్న పుకారు ఎంత విస్తృతంగా వ్యాపించిందో తెలిసిందే. అయితే.. అదేమీ లేదని పవన్ తో సహా పరిటాల కుటుంబ సభ్యులు ఈ మధ్య కాలంలో వివరంగా మీడియాకు చెప్పారు. అదేదో.. అప్పుడే క్లారిటీ ఇచ్చేస్తే.. ఆ పుకారు ఇన్నేళ్లు కంటిన్యూ అయ్యేది కాదు.
ఇది జరిగిన కొంతకాలానికే పవన్ ఇంటికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పవన్ ప్రేమలో పడ్డారని.. తనతో బద్రిలో నటించిన రేణుదేశాయ్ తో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న వార్త గుప్పుమంది. దీనిపై చిరు ఇంట్లో అన్నదమ్ముల మధ్య విభేదాలకు దారి తీసిందన్న వార్తలు జోరుగా సాగాయి. ఎప్పటిలాగే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కొన్నాళ్లకు.. రేణుదేశాయ్ తో పెళ్లి జరిగిపోయింది. కాకుంటే.. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవటం పవన్ ఇంట వ్యవహారం పెను సంచలనంగా మారింది.
తర్వాతి కాలంలో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టటం.. తర్వాతి కాలంలో దాన్ని కాంగ్రెస్ లో కలిపివేయటం పవన్ ఇంట చిచ్చుకు కారణమైందంటారు. ఈ వ్యవహారంపై ఇంట్లో భార్యభర్తల మధ్య మాటా మాటా పెరిగి చివరకు విడాకుల వరకూ వెళ్లిందని చెబుతారు. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకూ అటు రేణు కానీ పవన్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇష్యూ వారిద్దరి వ్యక్తిగతమైనది. కాకుంటే.. పవన్ అనే వ్యక్తి కోట్లాది మందిని ప్రభావితం చేయగలరు కాబట్టి.. అందరికి అసలేం జరిగిందన్న విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. రేణుతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయంపై పవన్ ఇప్పటివరకూ ఎప్పుడూ ఓపెన్ కాలేదు.
ఇది జరిగిన కొన్నాళ్లకు తనతో నటించిన ఒక రష్యన్ మహిళను పవన్ ప్రేమించి పెళ్లాడరంటూ ఆయన ఇంటికి సంబంధించిన మరో వార్త హడావుడి చేసింది. ఎప్పటిలానే పవన్ వైపు నుంచి మౌనం. మొయిన్ స్ట్రీమ్ మీడియాను తలదన్నేలా సోషల్ మీడియా వచ్చేయటం.. ఈ ముచ్చట బయటకు వచ్చిన రోజుల్లోనే వారిద్దరి రిజిష్టర్ మ్యారేజ్ కు సంబంధించిన పత్రాలు సోషల్ మీడియాలోనూ.. ఆ తర్వాత మొయిన్ స్ట్రీం మీడియాలో పబ్లిష్ అయ్యాయి. ఇలా పవన్ ఇంటి ముచ్చట మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. ఆ తర్వాత ఎప్పుడో పవన్ తన మూడో పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. అదేదో ముందే ఓపెన్ అయితే బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు.
ఇలా పలుమార్లు పవన్ ఇంటి విషయం పత్రికలకు ఎక్కటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఏపీలోని మంగళగిరి వద్దనున్న కాజా గ్రామంలో పవన్ కొనుగోలు చేసిన రెండు ఎకరాల స్థలానికి సంబంధించి ఇప్పుడు మళ్లీ వార్తలు మొదలయ్యాయి. రెండు ఎకరాల స్థలం ఇంటిని.. పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని భావిస్తున్న పవన్.. దానికి రూ.40 లక్షలకు కొన్నట్లుగా కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. అయితే.. అక్కడ మార్కెట్ ధర ఎకరా రూ.2 నుంచి రూ.3 కోట్లు పలుకుతుంది. అలాంటిది అంత కారుచౌకగా పవన్ కు ఎలా అమ్మారన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు. ఎప్పటిలానే పవన్ నుంచి మౌనం. అదే సమయంలో ఆయన ఇంటికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రేపో.. మాపో మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి.. పవన్ ఇంటి ముచ్చట ఎప్పుడూ ఆసక్తికర వార్తనే.