ప‌వ‌న్ కోల్పోతున్న‌దేమిటి?

Update: 2018-01-30 04:02 GMT
రాజ‌కీయాల్లో... ఎక‌న‌మిక్స్ కంటే ఎక్కువ లెక్క‌లు ఉంటాయి. కాక‌పోతే ఎక‌న‌మిక్స్‌లో పేప‌ర్ల‌లో ఆ లెక్క‌లుంటే రాజకీయాల్లో లెక్క‌లు ఆలోచ‌న‌ల్లో ఉంటాయి.  అటు తెలంగాణ‌లో గాని - ఇటు ఆంధ్రాలో గాని అనుభ‌వం - ప‌రిపాల‌న‌తో జ‌నాన్ని ఆకట్టుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఇపుడ‌న్నీ ఈక్వేష‌న్ల లెక్క‌ల‌తో అంద‌రూ కుస్తీలు ప‌డుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో కులాలున్నా వాటి ప్రభావం ఏపీలో ఎక్కువ‌. అందుకే అక్క‌డ రాజ‌కీయం నాయ‌క‌త్వం కంటే కూడా నాయ‌కుడి కులం మీద ఎక్కువ‌గా న‌డుస్తున్న‌ది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి కొత్త నాయ‌కుడికి అక్క‌డ చోటు దొరికింది.

రాజ‌కీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్‌. ఎన్టీఆర్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కుదిరింది, మెగాస్టార్ చిరంజీవికి కుద‌ర‌నిది అదే. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన అనేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో విప‌రీతాభిమానులు ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భ ఆనాడు అటు ప్ర‌ధాని అభ్య‌ర్థి ఇటు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఇద్ద‌రూ గుర్తించారు. అంత‌వ‌ర‌కు త‌నకు అంత శ‌క్తి ఉంద‌ని ప‌వ‌న్ కు కూడా తెలియ‌దు. కానీ విభ‌జ‌న‌తో ప‌వ‌న్ కులం శ‌క్తి ఏపీలో పెర‌గ‌డంతో అత్యంత ప‌టిష్ట‌మైన గూఢ‌చారి వ్య‌వ‌స్థ ఉన్న మోడీ ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి దానిని వ‌శం చేసుకోవ‌డానికి ప‌వ‌న్ ను వాడుకున్నాడు. దాని గ్ర‌హించిన చంద్ర‌బాబు వేగంగా అలెర్ట్ అయ్యి ప‌వ‌న్ మ‌ద్దతు నేరుగా సంపాదించారు. అనూహ్య‌మైన స్థాయిలో ద‌క్కిన ప్రాధాన్య‌త‌ను ఎంజాయ్ చేసిన ప‌వ‌న్ వారికి సై అన్నాడు. ఏం జ‌రుగుతుందో అర్థ‌మ‌య్యే నాటికి మోడీ అంద‌కుండా పోయాడు. కానీ... ప‌వ‌న్ ప్ర‌భ ఒక్క‌సారే ప‌నికొస్తుంద‌ని మోడీ గుర్తించినంత క‌చ్చితంగా చంద్ర‌బాబు అంచ‌నా వేయ‌లేక‌పోయారు. అందుకే ప‌వ‌న్ ని బ‌లంగా న‌మ్ముతున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా జ‌త‌క‌డుతున్నారు.

కానీ ఇటీవ‌ల ప‌రిణామాలు, ప‌వ‌న్ తాజా ప‌ర్య‌ట‌న‌లో అత‌నిని చూసిన చూస్తున్న జ‌నం రియాక్ట‌వుతున్న తీరు చూసి ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఏంటి? అత‌నికి ఉన్న క్లారిటీ ఏంటి? అత్యంత అయోమ‌య‌పు వ్యాఖ్య‌ల‌తో అత‌ను టీడీపీకి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం లేశ‌మాత్ర‌మైనా ఉందా? అని తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త అనుమానాలు క‌లుగుతున్నాయి. ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట అత‌నికి ఎంతో కొంత డ్యామేజ్ చేస్తూనే ఉంది. అత‌ను వేసే ప్ర‌తి అడుగు అత‌నిపై తెలుగుదేశం ప్ర‌భావాన్ని బ‌హిరంగం చేస్తున్నాయి. ఒక పార్టీ నేత జ‌నంలోకి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌పుడు అధికార పార్టీ నేత‌లను క‌ల‌వ‌డం - వారి ఇళ్ల‌లో తిన‌డం - అధికార పార్టీల‌ను పొగ‌డ‌టం  చ‌రిత్ర‌లో మొద‌టిసారి. ఒక‌వైపు తాను వారితో క‌లిసి పోటీ చేయ‌ను అంటున్నాడు. ఇంకో వైపు అత‌ను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవడానికి వ‌చ్చాను అని అధికారంలో ఉండి ఆ స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసిన‌ నేత‌ల‌ను క‌లుస్తూ ఉంటే... జ‌నానికి అత‌ని గురించి చాలా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. పాల‌కుల‌కు వారు చేస్తున్న త‌ప్పులను విమ‌ర్శిస్తే అవి స‌రిచేసే అవ‌కాశం ఉంటుంది. ఆ ప‌నిచేయ‌డు. ఆ ప‌నిచేసే ప్ర‌తి ప‌క్షాల‌ను విమ‌ర్శిస్తాడు. పోనీ అధికార పార్టీల‌కు రాజ‌కీయ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించడు.... మ‌రి ఏ కోణంలో ప‌వ‌న్ ను న‌మ్మాలి. ఏం న్యాయం చేస్తాడ‌ని న‌మ్మాలి అన్న‌ది ఇపుడు అతిపెద్ద ప్ర‌శ్న‌.  రాజ‌కీయ పార్టీ అంటూ జ‌న‌సేన పెట్టి.... దానికి ఒక సంపూర్ణ‌మైన పార్టీ రూపం ఇవ్వ‌కుండా త‌న రాజ‌కీయ అవ‌గాహ‌న రాహిత్యంతో ప్ర‌జ‌ల‌ను క‌న్ఫ్యూజ‌న్లోకి నెడుతున్న ప‌వ‌న్ కోల్పోతున్న‌ది ఓట‌ర్ల‌ను కాదు... జ‌నాల్లో త‌న‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని, త‌న కులంలో త‌న‌పై ఉన్న ఆశ‌ల‌ను కోల్పోతున్నారు.

యూట్యూబు - గూగుల్ ... యుగంలో అత‌ను మాట్లాడిన ప్ర‌తి మాటను సోష‌ల్ మీడియా ప్ర‌తి క్ష‌ణం జ‌నం క‌ళ్ల ముందు పెడుతుంటే 2014 ప్లాన్‌ మ‌రోసారి న‌మ్మ‌డానికి జ‌నం అమాయ‌కులు మాత్రం కాదు. అత‌ను అధికార పార్టీల‌ను మ‌ళ్లీ అధికారంలోకి తేవ‌డం ప‌క్క‌న పెడితే అస‌లు జ‌న‌సేన మీద జ‌నాల‌కు ఉన్న ఆశ‌లే కోల్పోయే ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితిలోకి ప‌వ‌న్ వెళ్లిపోయాడు.
Tags:    

Similar News