ముందు బాబు - జగన్‌ - తర్వాతే నేను: పవన్‌ కల్యాణ్‌

Update: 2019-01-09 16:56 GMT
ఏపీలో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పార్టీల వ్యూహాలు మారుతున్నాయి, మరింతగా పదునెక్కుతున్నాయి. ఎవరికి వారే ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే.. టీడీపీ - వైసీపీలతో పోలిస్తే.. ఈ విషయంలో జనసేన చాలా వెనకబడి ఉంది. ఇప్పటికీ జనసేన పార్టీకి చాలా జిల్లాల్లో కీలక నేతలు లేరు. ఇక రేపో మాపో వైసీపీ తన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ప్రకటించబోతోంది. కానీ పవన్‌ కల్యాణ్‌ రూటే సపరేట్‌ కదా. అందుకే పవన్‌ మాత్రం చంద్రబాబు - జగన్‌ ఇద్దరూ తమ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాతే.. తన లిస్ట్‌ ప్రకటిస్తాడట. 175 స్థానాలకు పోటీ చేయడం మాత్రం పక్కా అని చెప్తున్నాడు పవన్‌.

“మా పార్టీకి ఉన్న బలం తెలుసు - బలహీనతా తెలుసు. మా కేడర్ - వారికున్న బలం మాకు బాగా తెలుసు. మా ఐడియాలజీ నచ్చి మాతో కలిసి వచ్చేవారిని కలుపుకుంటూ మేం ముందుకు వెళ్తాం” అని అన్నారు పవన్‌. ఇక రీసెంట్‌ గా ఓ టీవీ చానెల్‌ తో జగన్‌ చెప్పిన వోట్‌ బ్యాంకింగ్‌ గురించి మాట్లాడాడు పవన్‌. “ఓట్‌ బ్యాంక్‌ గురించి ప్రతీ ఒక్కరూ తమ సైడ్‌ నుంచే ఆలోచిస్తారు. కానీ ప్రజాక్షేత్రంలో అసలు ఎలాఉందో ఎవ్వరూ పట్టించుకోరు. యువతకు ప్రస్తుతం రాజకీయాలపై చాలా అవగాహన ఉంది. కాబట్టి.. జగన్‌ - చంద్రబాబుకి ఓట్‌ బ్యాంక్‌ పై వారి స్థాయిలో ఆలోచనలున్నా.. అది సాధ్యాసాధ్యాలకు చాలా దూరంగా ఉందని” అన్నారు పవన్‌. మొత్తానికి టీడీపీ - వైసీపీ దూసుకెళ్తుంటే..పవన్‌ మాత్రం ప్రతీ విషయాన్ని చాలా లైట్‌ తీసుకుంటున్నారు. మరి ఆయన మనసులో ఏముందో.


Full View

Tags:    

Similar News