పవన్ కేసీఆర్ కంటే ఎక్కువా తక్కువా...?

Update: 2015-10-12 08:05 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే అతిథులపై అంచనాలకు ఇంకా తెరపడలేదు.... రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబుతో అంతంతమాత్రంగా సంబంధాలున్న నేతల సంగతేంటన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు చర్చ పవన్ కళ్యాణ్ వైపు మళ్లింది. కేసీఆర్ ను తానే స్వయంగా ఆహ్వానిస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో సాయపడి.. తరువాత టీడీపీతో కొంత తలపడిన జనసేన అధ్యక్షుడు పవన్ ను చంద్రబాబు పిలుస్తారా... పిలిచినా ఆయన వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు కేసీఆర్ ను పిలుస్తున్నట్లుగా చంద్రబాబే స్వయంగా పవన్ ను కలిసి పిలుస్తారా లేదంటే మంత్రులతో పంపించి మమ అనేస్తారా చూడాలి.

గత ఎన్నికల్లో పవన్ టీడీపీ విజయానికి సాయపడ్డారన్నది అందరికీ తెలిసిందే. అయితే... ఆ తరువాత ఆయన వైఖరి మారింది. రాజధాని భూసేకరణ విషయంలో ఆయన రైతుల తరఫున మాట్లాడారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్, ఏపీ సర్కార్ జారీ చేసిన భూసేకరణ జీవోను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పటినుంచి టీడీపీ, జనసేనల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన్ను పిలిచినా వస్తారా అన్నది అనుమానమే. తాను వ్యతిరేకించిన కార్యక్రమానికే రావడమనేది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి పవన్ రారనే ఆయన అనుచరులు అంటున్నారు.  

అయితే... పవన్ వచ్చినా రాకున్నా చంద్రబాబు ఆయన్ను పిలవడమైతే గ్యారంటీ.. ఆయనే స్వయంగా వెళ్తారా... లేదంటే ఎవరితోనై ఆహ్వానం పంపిస్తారా తేలాలి.
Tags:    

Similar News