భీమవరం డ్యామేజ్ కి పవన్ మార్క్ సాయం

Update: 2015-09-12 02:14 GMT
తన విలక్షణ వ్యక్తిత్వంతో అందరి కంటే భిన్నంగా వ్యవహరించే జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాధ్యతగా ఉంటానని చెప్పుకునే ఆయన.. అందుకు తగ్గట్లే వ్యవహరించి.. మాటలే కాదు చేతల్లోనూ పవర్ స్టారే అన్నట్లుగా వ్యవహరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

తన వల్ల ఎలాంటి తప్పులు జరగవన్నట్లు వ్యవహరిస్తూ.. తన వల్ల ఏదైనా నష్టం జరిగితే వెంటనే స్పందించే ఆయన దాన్ని భర్తీ చేస్తుంటారు. ఇది ఇప్పటివరకూ తెలిసింది. అయితే.. తన ఫ్యాన్స్ వల్ల జరిగిన నష్టానికి తానే పూచీకత్తు అన్నట్లుగా వ్యవహరించిన పవన్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఫ్లెక్సీ గొడవలతో భీమవరం పట్టణం అట్టుడికిపోయింది. పవన్.. ప్రభాస్ ఫ్యాన్స్ ల మద్య నడిచిన రచ్చ కొత్త ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తి కాల్చేయటం.. ఈ ఘటన భీమవరం పట్టణంలో ఉద్రికత్తలు సృష్టించటం.. ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్ పనేనని ఆరోపించటం.. ఈ సందర్భంగా పలు ఆస్తులకు నష్టం వాటిల్లటం.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి.. పరిస్థితిన అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ విషయాలన్నీ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్.. తన ఫ్యాన్స్ కారణంగా జరిగిన ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తుల నష్టానికి తాను బాధ్యత వహిస్తానని చెప్పారట. గొడవల గురించి ఎస్ ఐతో మాట్లాడి రూ.3లక్షలు పంపారట. మిగిలిన ఖర్చును భరిస్తానని చెప్పినట్లు సమాచారం. ఆస్తుల నష్టపరిహారంలో భాగంగా రూ.3లక్షలు పవన్ పంపారని భీమవరం ఎస్ ఐ వెల్లడించారు. బాధ్యతగా ఉండాలని చెప్పటమే కాదు.. బాధ్యతగా ఉండటం ఎలానో చేతల్లో చూపించిన పవన్ అందరిలాంటి వాడిని కాదని తన చర్యలతో చెప్పకనే చెప్పేశారు. ఏమైనా.. ఇంత బాధ్యతగా వ్యవహరించిన పవన్ ను అభినందించాల్సిందే.

Tags:    

Similar News