తామెంతో అభిమానించే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఏం చేస్తారు? అయితే.. పార్టీ చేసుకోవటం.. లేదంటే సదరు ప్రముఖుడి తరఫున కార్యక్రమాలు నిర్వహించటం చేస్తుంటారు. విలక్షణంగా వ్యవహరించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుకు తగ్గట్లే తాజాగా ఆయన పార్టీ అభిమానులు వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. గడిచిన రెండున్నరేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పెదవి విప్పని పవన్ కల్యాణ్.. ఈ మధ్యనే తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. కేంద్రంలోని మోడీ సర్కారును కడిగేయటం తెలిసిందే.
పనిలో పనిగా ఏపీ రాష్ట్ర ఎంపీలపై కూడా ఆయన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై పలు రాజకీయ పక్షాలతో పాటు పలువురు ఇప్పటికే ఆందోళన చేస్తున్నా.. వారికి మద్ధతు ఇవ్వని పవన్ కల్యాణ్.. తనదైన శైలిలో మండిపడటమే కాదు.. హోదా మీద తాను ఉద్యమం చేయనున్నట్లుగా ప్రకటించారు. పవన్ కు తగ్గట్లే ఆయన్నుఅభిమానించే పార్టీ అభిమానులు సైతం తాజాగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ధర్నాకు దిగారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా ధర్నాకు దిగటం పలువురికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నాకు దిగటం చూసిన వారంతా.. పవన్ బర్త్ డే గిఫ్ట్ గా ఈ ఆందోళన చేపట్టినట్లుగా వ్యాఖ్యానించటం కనిపించింది. ప్రత్యక హోదాపై బాస్ చేస్తున్న ఉద్యమానికి తమ మద్ధతు అన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. బాస్ ఫుట్టిన రోజున ధర్నా చేస్తే మరింత వెరైటీగా ఉంటుందని భావించారో ఏమో కానీ.. ఉన్నట్లుండి ధర్నా చేయటం మాత్రం పలువురి దృష్టిని ఆకర్షించిందని చెప్పక తప్పదు.