జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ దూకుడు పెంచుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ముందస్తు ఎన్నికలు వస్తే బరిలోకి దిగేందుకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించిన పవన్ తాజాగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. ఈ దఫా ఉత్తరాది-దక్షిణాది రాజకీయాలను తన ట్వీట్ ద్వారా మరోమారు తెరమీదకు తెచ్చారు. పలు పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్ పేజీల వ్యాసాలను ప్రస్తావిస్తూ దక్షిణాది నాయకత్వం ప్రజల మనోభావాలను గౌరవించాలని అన్నారు.
రెండు పత్రికల్లో వచ్చిన వార్తాపత్రికల క్లిప్పింగులను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన పవన్..దక్షిణాది నాయకత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై - రాజకీయంగా సహా ఇతర అంశాలపై సమాన అవకాశాలు కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు. విశ్లేషకులు చెప్తున్నట్లుగా స్పష్టమైన తేడా అనేది ఉత్తరాది-దక్షిణాది రాజకీయాల్లో కనిపిస్తోందని పవన్ ఈ సందర్భంగా విశ్లేషించారు. దేశంలో భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా గౌరవించాలని పవన్ సూచించారు. కాగా, పవన్ మరోమారు ఉత్తరాది రాజకీయాల గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
కాగా, కొద్దికాలం క్రితం సైతం ఉత్తరాది-దక్షిణాది రాజకీయాల విషయంలో పవన్ తన నిరసన గళాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత ఒకరు చేసిన కామెంట్లను పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. అంతకుముందు యూపీలో మాత్రమే రుణమాఫీ ఇవ్వడానికి అంగీకరించడం సరైంది కాదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను విస్మరించడం సరికాదని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ప్రాంతానికే పరిమితమైతే ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయని పవన్ తన ట్వీట్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, జనసేన పార్టీ ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను ఎన్డీఏ భాగస్వామిని కానని పవన్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్ ఈ కామెంట్ చేయడంతో బీజేపీ-జనసేన చీలికపై క్లారిటీ వచ్చింది. దాన్ని నిజం చేస్తున్నట్లుగా పవన్ తాజాగా ప్రధాని ఉత్తరాది-దక్షిణాది పేరుతో మోడీ చర్యలను తప్పుపడుతున్నారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/