చిరుకు.. త‌న‌కు తేడా చెప్పేసిన ప‌వ‌న్‌

Update: 2019-04-04 07:31 GMT
అన్న‌య్య ఆ దేవుడితో స‌మానం అని చెప్పేస్తారు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్. త‌మ్ముడి మీద త‌న‌కున్న వాత్సాల్యాన్ని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తూ ఉంటారు అన్న‌య్య చిరంజీవి. అన్నద‌మ్ముల అనుబంధం మెగా ఫ్యామిలీలో కొట్టొచ్చినట్లు క‌నిపిస్తుంటుంది. త‌మ మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి తేడా లేకున్నా.. తాము న‌డిచే దారుల విష‌యంలో ఎవ‌రి దారి వారిద‌న్న విష‌యం క‌నిపిస్తూ ఉంటుంది.

రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చి.. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి. .ఆ త‌ర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి.. కాంగ్రెస్ లో కొన‌సాగుతున్నా.. యాక్టివ్ గా లేర‌న్న సంగ‌తి తెలిసిందే. ఆన్న‌య్య ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా జ‌న‌సేన పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

పార్టీని న‌డిపించే తీరులో.. త‌న‌కు త‌న అన్న‌య్య‌కు ఏ మాత్రం పోలిక లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ఫ్రూవ్ చేశారు. ప‌వ‌న్ కు అత్యంత కీల‌క‌మైన తాజా ఎన్నిక‌ల్లో త‌మ్ముడి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌టానికి చిరంజీవి వ‌స్తారా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. అయితే.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం.. విదేశాల‌కు వెళ్లిపోవ‌టంతో చిరు ప్ర‌చారానికి రార‌న్న విషయంపై క్లారిటీ వ‌చ్చేసింది.

తాజాగా ఇదే విష‌యంపై ప‌వ‌న్ స్పందించారు. ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న అన్న చిరంజీవి గురించి.. త‌మ త‌ర‌ఫున ప్ర‌చారం చేసే విష‌య‌మై ఆయ‌న రియాక్ట్ అయ్యారు. త‌న అన్న‌య్య ప్ర‌చారానికి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తేల్చేశారు. పాలిటిక్స్ ను తాను చూసే విధానం వేర‌ని.. అన్న‌య్య చూసే విధానం వేర‌న్న ప‌వ‌న్.. ఆ విష‌యంలో త‌మ ఇద్ద‌రికి స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు. అన్న‌య్య క‌ళాకారుడ‌ని.. తాను క‌ళాకారుడ్ని కాద‌ని.. అదే మాఇద్ద‌రి మ‌ధ్య తేడా అని తేల్చి చెప్పారు ప‌వ‌న్. సినీ న‌టుడిగా కోట్లాది మందిపై త‌న ముద్ర వేసిన ప‌వ‌న్.. త‌న‌ను తాను క‌ళాకారుడ్ని కాద‌ని తేల్చేయ‌టం గ‌మ‌నార్హం.  


    

Tags:    

Similar News