జనసేన-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా గిద్దెలూరులో జనసేన అభ్యర్థి కోసం ప్రచార సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ హాట్ కామెంట్స్ చేశారు.
దొంగ పొత్తులు పెట్టుకునే అవసరం తనకు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ధైర్యంగా పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతామన్నారు. జగన్ లాగా తెరవెనుక పొత్తు పెట్టుకోమని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ధైర్యంగా బాబుతో కలుస్తామని అనడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఇలా సానుకూలంగా ఉండడం.. అవసరమైతే ధైర్యంగా ముందుకు వెళుతానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఎన్నికల టైం.. ఒకవేళ ఏపీలో హంగ్ వస్తే పవన్ మళ్లీ టీడీపీతో కలిసి పోవడానికి ఈ మాటలు ఊతమిచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే దైర్యంగా టీడీపీతో వెళుతానని పవన్ ప్రకటించడంతో ఇక జనసేన-టీడీపీ అంతర్గత పొత్తు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.