ప్రత్యేక హోదా విషయంలో తాను ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి చేసేదేమీ లేదని అంటున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాన్. ముందు హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేశాకే ఏం చేయాలో ఆలోచిస్తాని పవన్ అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయొచ్చు కదా అని పవన్ ను విలేకరులు ప్రశ్నించగా.. తాను ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన పనైపోతుందని అనుకోవడం లేదని.. అక్కడికి వెళ్లాక మనమేదో అనుకుంటే అక్కడేదో జరిగితే బాగోదని... ఢిల్లీలో అంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్లు ఏదైనా చేస్తారేమో చూడాలని పవన్ అభిప్రాయపడ్డాడు.
గురువారం ఉదయం ప్రత్యేక విమానమెక్కి మరీ విజయవాడకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశాడు వెళ్లాక బాబుతో మూడు గంటల పాటు సమావేశం కూడా అయ్యాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు పవన్. గత నెల రాజధాని శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, ఈ విషయమై చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పడానికే ఈ రోజు సమావేశమయ్యానని చెప్పాడు పవన్. బాబుతో వివిధ అంశాలపై మాట్లాడానని.. రాజధాని గ్రామాలలో భూ సేకరణ చేయబోమని ప్రకటన చేసినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నాడు.
విశాఖలోని బాక్సైట్ ఘనులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పునరాలోచించాలని.. గిరిజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపించే చర్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు పవన్ తెలిపాడు. రాజధానితో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధి మీద కూడా దృష్టిపెట్టాలని.. రాజధాని ప్రాంతంలో రైతులతో పాటు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వ్యవరించాలని కోరానని చెప్పాడు.