జనసేన అధినేత వపన్ కల్యాణ్ నిర్వహించే రివ్వూల తీరు నిజంగానే ఏమాత్రం మారడం లేదు. ఎన్నికల పోలింగ్ ముందు విజయవాడలోని పార్టీ కార్యాలయం సందడి సందడిగా ఉంటే... పోలింగ్ ముగియగానే... ఏకంగా ఆ కార్యాలయాన్ని మూసేయక తప్పలేదు. రాజధాని అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించిన పార్టీ కొత్త కార్యాలయం వేదికగానే ఇప్పుడు పవన్ తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆదివారం మదర్స్ డేను పురస్కరించుకుని ఈ కార్యాలయంలో ప్రత్యక్షమైన పవన్... మరోమారు ఎన్నికల సరళిని తెలుసుకునేందుకు ఓ సమీక్ష నిర్వహించారు.
పార్టీ తరఫున ఎంపీ - ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారంతా ఈ సమీక్షకు హాజరుకావాలని కూడా అందరికీ సమాచారం వెళ్లింది. అయితే ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లకు కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఈ సమీక్షకు 40 మంది కూడా హాజరు కాలేదు. ఇదివరకు నిర్వహించిన సమీక్షకు కేవలం 12 మంది మాత్రమే రాగా... ఇప్పుడు ఆ సంఖ్య కాస్త పెరిగినా... పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో పావలా వంతు మంది కూడా హాజరుకాకపోవడం గమనార్హం. గవెరసి గడచిన సమీక్ష మాదిరే ఈ సమీక్షలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. తాజా సమీక్షకు మందేమీ రాకున్నా కూడా పవన్ తనదైన శైలిలో మాట్లాడేశారు.
ఎన్నికల్లో మార్పు మొదలైందని - జనసేన కోరుకున్నది కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న దాని కంటే కూడా ఎంతమేర ఓటింగ్ శాతాన్ని రాబట్టామన్నదే ముఖ్యమని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. అసలు ఎన్నికల్లో ఇన్ని స్థానాలు గెలుస్తామని ఏ ఒక్కరూ ఆశపెట్టుకోవద్దని కూడా ఆయన తన పార్టీ అభ్యర్థులకు ఉచిత సలహా పడేశారు. ఈ సందర్భంగా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించి మూసేసిన ప్రజారాజ్యం పార్టీతో జనసేనకు పోలిక చూపెట్టిన పవన్... ప్రజారాజ్యంలో చేరినవారంతా ఆశతో వస్తే... జనసేనలో చేరిన వారంతా ఆశయంతో వచ్చారని కూడా తనదైన శైలి స్టేట్ మెంట్ పడేశారు.