నేను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదు:ప‌వ‌న్

Update: 2018-11-07 10:48 GMT
కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టిన టీడీపీ అధినేత‌  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. చ‌రిత్రాత్మ‌క అవ‌స‌రం అని...దేశ భ‌విష్య‌త్తు కోసం అని...చంద్ర‌బాబు త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకునేందుకు చూస్తోన్న వైనం పై టీడీపీ నేత‌లు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. త‌న అన్నయ్యను - కుటుంబాన్ని - కాంగ్రెస్‌ని వ‌ద్ద‌నుకొని టీడీపీకి మద్దతిచ్చాన‌ని...ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్నారని ప‌వ‌న్ మండిప‌డ్డారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ వద్దని ప్ర‌జ‌లు త‌రిమి కొట్టార‌ని, కాంగ్రెస్ హఠావో నినాదంతో తాను టీడీపీని గెలిపించానని, కానీ, నేడు చంద్ర‌బాబు...రాహుల్ తో క‌ల‌వ‌డం ఏమిట‌ని నిప్పులు చెరిగారు. 2009 లో ఏం పీకారు.. ఇప్పుడు ఏం పీకుతారు అనే మాటల మధ్య తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. త‌న‌ పై చెత్త ప్రోగ్రామ్స్ చేయిస్తూ, మరోవైపు దోపిడీ చేస్తుంటే ఎదురు తిరగకుండా ఎలా ఉంటామని అన్నారు. అవినీతికి పాల్పడితే చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను న‌డిరోడ్డు పైకి లాక్కొస్తానని హెచ్చరించారు.

చంద్రబాబు `వెన్నుపోటు`పొడిస్తే పొడిపించుకోవడానికి తాను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ప‌వ‌న్ అన్నారు. జ‌న‌సైనికులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్ర‌స్తుతానికి  సంయమనం పాటించాలని, అవసరమైన రోజు తాను చెప్తానని, ఆ త‌ర్వాత మీ ఇష్టమని పవన్ చెప్పారు. తాను ఆచితూచి మాట్లాడుతాన‌ని, ఒక దోపిడీదారుడిని ల‌ఫూట్ అన్నందుకు డిబేట్లు పెట్టార‌ని కొన్ని చానెళ్ల‌ పై మండిప‌డ్డారు. ఎవరు ఎవరితో పడుకున్నారు అనేది న్యూసా అని ప్ర‌శ్నించారు. ఈ పనికిమాలిన వార్తలు అని పవన్ అన్నారు. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తినని రెండు చేతులతో గులాంగిరి చేసే వాడిని కాదని అన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులే ఆ పార్టీని వీడుతుంటే...చంద్రబాబు మాత్రం వారి కాళ్లు పట్టుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు హెరిటేజ్ బిజినెస్, ఆస్తులు అంటే ప్రేమ అని....అందుకే తెలంగాణ అంటేనే ఆయ‌నకు భయం పట్టుకుందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకూ వెళ్లగలరని అన్నారు. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడ‌ని.....వారికే ఆయనతో బంధుత్వాలున్నాయ‌ని ఎద్దేవా చేశారు. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదని, భయం అంతకంటే లేదని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు త‌న‌ను ఏం కావాలో కోరుకోమ‌న్నార‌ని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండాలి...మీ ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి...అని చంద్ర‌బాబును కోరేవాడినని పవన్‌ గుర్తు చేసుకున్నారు. తాను కోరింది తప్ప అన్నీ చంద్ర‌బాబు చేశారని పవన్ దుయ్యబట్టారు. జగన్‌పై దాడి బాధ కలిగించిందని...దోషులెవరో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. దైవం తలిస్తే తాను పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చని...అలాగే సిఎం కూడా కావచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Tags:    

Similar News