విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటివరకూ గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పలు సందర్భాల్లో.. పలు వేదికల మీద మాట్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో హోదా సాధన కోసం మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాలన్న యూత్ కి ఓపెన్ గా మద్దతు పలకటమే కాదు.. ఈ అంశంపై ఆయన కాస్తంత హడావుడే చేశారు. ఈ అంశంపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించి.. హోదా సెంటిమెంట్ రగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజల మనసుల్లో ఏముంది? ఈ ఉదంతంపై వారు సీరియస్ గా ఉన్నారా? లేరా? హోదా విషయంలో తమకు అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారా? లాంటి ప్రశ్నలు సంధించి.. ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక రహస్య సర్వేను ఆయన జరిపిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ తాను జరిపిస్తున్నసర్వేలో హోదా అంశాన్న ఏపీ ప్రజల్లో యాభై శాతం మంది అయినా సీరియస్ గా ఉంటే.. తాను రాజీ పడకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందుకు భిన్నంగా ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలు సంతృప్తితో ఉంటే.. అందుకు దారి తీసిన కారణాల్ని విశ్లేషించటంతో పాటు.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏపీ ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి హామీలు పొందాలన్న అంశంపై దృష్టి పెట్టనున్నట్లు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై తాను నిర్వహిస్తున్న రహస్య సర్వే ఫలితాల ఆధారంగా తన ఫ్యూచర్ ప్లాన్ సెట్ చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సర్వే అనంతరం.. ఎన్నికలకు కాస్త ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఏపీలోని అన్నిప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలేం కోరుకుంటున్నారన్న అంశంపై స్పష్టత తెచ్చుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/