బాబుతో ప‌వ‌న్ భేటీ కానున్నారు ఎందుకో తెలుసా?

Update: 2017-07-17 04:50 GMT
సాధార‌ణంగా విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు రాజ‌కీయ‌నేత‌లు. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. త‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయో.. వాటికి బ‌లం చేకూరేలా వ్య‌వ‌హ‌రించ‌టం ప‌వ‌ర్ స్టార్‌కు మాత్ర‌మే చెల్లుతుంది. పార్ట్ టైం పొలిటీషియ‌న్ గా విమ‌ర్శ‌లు ఎదుర్కొనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎప్పుడు స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌తారో.. మ‌రెప్పుడు కామ్ గా ఉంటారో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

ప‌లు అంశాల్ని తెర మీద‌కు తీసుకొస్తూ.. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని హ‌డావుడి చేసే ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌కుండా పోవ‌టం.. అంద‌రూ ఆయ‌న్ను మ‌ర్చిపోయే వేళ‌.. మ‌ళ్లీ తిరిగి తెర మీద‌కు రావ‌టం క‌నిపిస్తుంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

అప్పుడెప్పుడోఉద్దాణం స‌మ‌స్య మీద గ‌ళం విప్పి.. టైమ్ లైన్ ఇచ్చిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ఆ విష‌యం గురించి మాట్లాడింది లేదు. ఉన్న‌ట్లుండి ఆయ‌న ఇప్పుడా అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు. అమెరికాలోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన వైద్యుల బృందాన్ని ఉద్దానం స‌మ‌స్య‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో చ‌ర్చించేందుకు భేటీ కానున్నట్లు చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం సోమ‌వారం సాయంత్రం భేటీ కావొచ్చ‌ని తెలుస్తోంది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. బాబుతో తాజా భేటీ సంద‌ర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన త‌ర‌ఫున ప‌రిశీలించిన అంశాల్ని వివ‌రించటంతో పాటు.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన డ‌యాల‌సిస్ కేంద్రాల్ని.. మందుల పంపిణీపైన సూచ‌న‌లు చేస్తార‌ని చెబుతున్నారు. నిజంగానే ఉద్దాణం మీద అంత ప్రేమే ఉంటే.. ఇన్నేసి నెల‌లు టైం తీసుకోవ‌టంలో ప‌వ‌న్ వ్యూహం ఎమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. త‌న‌కు తోచిన‌ప్పుడు సినిమాలు తీస్తూ.. తాను తీసిన‌ప్పుడు సినిమాను చూడ‌మ‌న‌టం బాగానే ఉంటుంది కానీ.. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కూడా అదే సూత్రాన్ని వ‌ర్తింప‌చేయ‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News