మీ వ‌ల్లే ఓడిపోయా.. అభిమానుల‌పై ప‌వ‌న్ అస‌హ‌నం

Update: 2019-12-09 04:06 GMT
మెగా ఫ్యామిలీ హీరోల‌కు సంబంధించిన వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు స‌మ‌యం సంద‌ర్భం చూడ‌కుండా అత‌డి పేరుతో నినాదాలు చేస్తూ ఎలా ఇబ్బంది పెడ‌తారో తెలిసిందే. ఇది ఒక ద‌శ దాటాక పెద్ద త‌ల‌నొప్పిగా మార‌డంతో అల్లు అర్జున్, నాగ‌బాబు లాంటి వాళ్లు అస‌హ‌నానికి గుర‌య్యారు. ప‌వ‌న్ అభిమానుల మీద త‌మ కోపాన్ని చూపించేశారు. అయినా ప‌వ‌న్ అభిమానులేమీ మార‌లేదు.

 చివ‌రికిప్పుడు ఇలాంటి నినాదాల‌తో స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణే ఇబ్బంది ప‌డిపోయాడు. ఓ సీరియ‌స్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే.. అభిమానుల పాటికి అభిమానులు నినాదాలు చేయ‌డంతో ఆయ‌న‌కు కోపం వ‌చ్చేసింది. తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట‌లో నిర్వ‌హించిన రైతు స‌ద‌స్సులో ఈ ప‌రిణామం చోటు చేసుకుంది.

ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ ఆవేద‌న స్వ‌రంతో మాట్లాడుతుండ‌గా.. కార్య‌క‌ర్త‌లు, అభిమానులు అరుపులు, కేకలతో అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆయ‌న‌కు కోపం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో జనసైనికులపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. వాళ్ల‌లో క్రమశిక్షణ లేకే తాను ఓడిపోయానని వ్యాఖ్యానించాడు. ‘‘అన్నం పెట్టే రైతు కష్టాలు చెబుతున్నపుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా వినిపిస్తుంది?నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది.. అది మర్చిపోకండి. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచి ఉండేది’’ అని పవన్‌ మండిపడ్డాడు.
Tags:    

Similar News