జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కాసింత చిత్రంగా కనిపిస్తుంటుంది. ఎప్పుడేం మాట్లాడాలో.. సరిగ్గా అందుకు వ్యతిరేకంగా ఆయన మాటలు ఉంటాయి. ఓపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకబ్జాల వ్యవహారం హాట్ హాట్ గా ఉంటే.. అందుకుభిన్నంగా తన పార్టీ వ్యవస్థాపనకు సంబంధించిన ముచ్చట్లను కూల్ కూల్ గా ప్రస్తావిస్తున్నారు. ఏపీలోని విశాఖ నగరంలో వేలాది ఎకరాలు భూకబ్జాకు గురయ్యాయని.. దాదాపు రూ.3 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని విపక్ష నేతలు విరుచుకుపడితే.. కిమ్మనకుండా ఉండిపోయిన పవర్ స్టార్.. తమ పార్టీ నిర్వహిస్తున్న శిబిరాల గురించి.. అందులో పాల్గొంటున్న యూత్ గురించి తెలుసుకుంటున్న వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని గురువారం అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యువత చేసిన ప్రసంగాల వీడియోల్ని ఆయన చూశారు. ఈ సందర్భంగా కొందరి ప్రసంగాలకు ఆయన కదిలిపోయిన వైనం వీడియోలో కనిపించింది.
పాలకుల తప్పులకు ప్రజలు పడుతున్న ఇబ్బంది పడటాన్ని చూసిన తాను చలించిపోయానన్న పవన్.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో జరిగిన తప్పొప్పులను పరిశీలించినట్లుగా పవన్ చెప్పారు. నాడు జరిగిన తప్పుల్ని మళ్లీ జరగకుండా చూస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. జులై నాటికి జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని.. సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలన్న ఆయన.. అలాంటి వారి కోసమే ఎంపికలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతా ఓకే కానీ.. అన్నయ్య పార్టీలో తప్పులు జరుగుతున్నప్పుడు ఇంతటి ఫైర్ ఉన్న పవన్ ఆ విషయాన్ని అన్నతో షేర్ చేసుకున్నారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/