సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు. తన ట్వీట్లతో సంచలనాల మీద సంచనాల్ని నమోదుచేస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా శ్రీరెడ్డి పేరుతో సాగిన వ్యవహారం వెనుక ఉన్న కొత్త కోణాన్ని బయటకు తీసి మరీ కలకలం రేపుతున్నారు.
తన మీదా.. తన ఇమేజ్ మీదా సాగుతున్న మీడియా రేప్ అంటూ కొత్త పదాన్ని తీసుకొచ్చి మరీ ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి ప్రయోజనాల్ని ఆశించకుండా పని చేసిన దానికి ప్రతిఫలంగా చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకొని కుట్ర చేస్తున్నట్లుగా ఆరోపించారు. గడిచిన ఆరు నెలలుగా టీవీ9.. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి.. ఇతర కొన్ని ఛానెల్స్.. సోషల్ మీడియాల ద్వారా తన మీదా.. తన కుటుంబం మీదా..తనను అభిమానించే వారి మీదా నిరవధిక మీడియా అత్యాచారం జరుపుతున్నారని.. జరిపిస్తున్టన్లుగా ఆరోపించారు.
ఇందుకోసం రూ.10కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వెల్లడించి సంచలనం సృష్టించారు. తనను సంబంధం లేని విషయాల్లోకి లాగి.. తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా పచ్చి బూతు తిట్టించి.. పదే పదే ప్రసారం చేసిన వైనాన్ని తప్పు పట్టారు. టీడీపీ పార్టీ వ్యక్తులు ఇలా తనపై కుట్ర చేస్తూ.. మరోవైపు దీక్షలో పాల్గొనాలంటూ పిలుపు ఇవ్వటాన్ని ఎలా తీసుకోవాలో చెప్పాలంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. గడిచిన ఆరు నెలలుగా తనపై లోకేశ్ చేస్తున్న కుట్ర గురించి చంద్రబాబుకు తెలీదా? అంటూ నిలదీశారు. మరి.. ఈ సంచలన ఆరోపణలపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇక.. పవన్ చేసిన ఆరోపణల్ని ఆయన ట్వీట్లతో చూస్తే..
"మీ ప్రభుత్వం రావటానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం.. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ను వేదికగా చేసుకొని.. మీ కొడుకు.. అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9..ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇతర కొన్ని ఛానెల్స్ తదితర సోషల్ మీడియా ద్వారా నా మీదా.. నా కుటుంబం మీదా.. నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు.. జరిపిస్తున్నారు"
"ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా (రూ.10కోట్లు డబ్బు ఖర్చు పెట్టి మరి) నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగి నన్ను.. నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా వచ్చి బూతు తిట్టించి.. దానిని పదే పదే ప్రసారం చేసి.. డిబేట్లు పెట్టి.. దానిని మీ పార్టీ వ్యక్తులు సర్య్కులేషన్ లో పెట్టి.. ఇప్పుడు మీ పిలుపును ఎలా తీసుకోవాలి చెప్పండి?"
"వర్మ అనే ఒక దర్శకుడు.. శ్రీసిటీ ఓనర్ (టీవీ 9 ఓనర్) అయిన శ్రీనిరాజు (రూ.10కోట్లు ఇచ్చిన వ్యక్తి).. టీవీ 9 రవిప్రకాశ్ (మీడియా డిజైన్).. వీరి ముగ్గురి ద్వారా మీ అబ్బాయి లోకేశ్.. అతని స్నేహితుడైన రాజేష్ కిలారు కలిసి చేయిస్తున్నది మీకు తెలియదంటే నమ్మమంటారా?"