సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయనకు చెందిన 400 సోషల్ ఖాతాల్ని ఇటీవల ట్విట్టర్ బ్లాక్ చేయటం సంచలనంగా మారింది. తామేం తప్పు చేశామని.. తమ అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసిందన్న ఆగ్రహంతో పాటు.. ఈ చర్య వెనుక ఏం జరిగింది? ఎవరున్నారు? నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాల్ని సస్పెండ్ చేశారా? అంటూ పవన్ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించటం తెలిసిందే.
జనసేన.. జనసేన మద్దతుదారులకు చెందిన 400 ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయటంపై పవన్ కల్యాణ్ చేసిన ఆగ్రహ ప్రకటనపై ట్విట్టర్ స్పందించింది. నిన్నటి వరకూ బ్లాక్ లో ఉన్న ఖాతాలు ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి. దీంతో.. పవన్ అండ్ కోకు చెందిన ఖాతాలు యథావిధిగా పని చేయటం షురూ అయ్యాయి.
ఇదే విషయాన్ని తెలియజేసిన పవన్ కల్యాణ్. . తాజాగా ట్విట్టర్ కు థ్యాంక్స్ చెప్పారు. బ్లాక్ అయిన 400 ఖాతాల్ని పునరుద్దరించినందుకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేయటమే కాదు.. రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్ఛను కాపాడుతున్నందుకు ఆయన థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మొత్తానికి పవన్ ఆగ్రహానికి ట్విట్టర్ వెంటనే రియాక్ట్ అయినట్లుగా కనిపించక మానదు.