తమ న్యాయమైన డిమాండ్లను తీరేలా ప్రయత్నం చేయాలని తెలంగాణకు సంబంధించిన వారు ఎవరిని కలవాలి? కచ్ఛితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలంటారు ఎవరైనా. అందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిస్తే ఏం జరుగుతుంది? చిన్నపిల్లాడైనా సమాధానం చెప్పేస్తారు. మరేమైందో ఏమో కానీ.. కొన్నేళ్లుగా నానుతున్న చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మరింత స్థలాన్ని కేటాయించేలా తమ తరఫున పోరాడాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సినీ పరిశ్రమకు చెందిన పలువురు వినతి పత్రాన్ని ఇచ్చిన సీన్ చూస్తే నవ్వు రాక మానదు.
జనసేన అధినేత పవన్ కు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు మధ్య టర్మ్స్ బాగానే ఉన్నప్పటికీ.. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కు ఆయనిచ్చే గౌరవమర్యాదలు ఎంతన్నది ఒక క్వశ్చన్. అందునా.. పవన్ రెండు తెలుగు రాష్ట్రాల తరఫున పోరాడుతున్నట్లు చెప్పినా.. ఆయన ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు.
పవన్ ఎంత సినిమా రంగానికి చెందిన వ్యక్తి అయినా.. విషయం తేల్చాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నది మర్చిపోకూడదు. ఇలాంటప్పుడు సినీ కార్మికుల నివాసానికి అవసరమైన భూమిని ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నో.. లేదంటే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కో ఇవ్వాలే కానీ..సంబంధం లేని జనసేన అధినేత పవన్ కు ఇస్తే.. గులాబీ బాస్ గుస్సా కాకుండా ఉంటారా? అన్నది క్వశ్చన్.
అసలే కేసీఆర్. ఎప్పుడెలా రియాక్ట్ అవుతారో ఒక పట్టానా అంచనాకు అందని అధినేత. అలాంటి ఆయన విషయంలో చిన్న పొరపాటు జరిగినా.. వేలాదిమందికి లబ్ది చేకూరే అంశం పక్కదారి పడుతుంది. మరింత చిన్న పాయింట్ ను వదిలేసి.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు.. పవన్ ను కలిసి చిత్రపురి సొసైటీకి మరో తొమ్మిది ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని కోరటం ఏ మేరకు వర్క్ వుట్ అవుతుందన్నది సందేహమే. చూస్తూ.. చూస్తూ కేసీఆర్ సారుకు కాలే ఈ తరహా చర్యలతో సమస్యలు పరిష్కారం కావు కదా? మరింత చిక్కుమడులు పడే ప్రమాదం ఉందనన విషయాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు.