తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో అడుగు వేయనున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా నటుడు చేయని సాహసం చేయనున్నారు. తెలుగు కోసం.. తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
సినిమాలు తీసుకుంటూ.. బండి లాగించే ఎందరో తెలుగు సినీ ప్రముఖులకు భిన్నంగా నిరసన గళం విప్పాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్భంధ తమిళం చట్టం కారణంగా మైనార్టీ భాషలకు చెందిన వారు తమ మాతృభాషల్లో చదువుకునే అవకాశం కోల్పోతున్నారు. దీనిపై గళం విప్పాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తమిళనాడులోని తెలుగువారికి సంఘీభావంగా నిర్వహించనన్న దీక్షను హోసూరులో చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కంటే కూడా తెలుగు భాష పరిరక్షణ కోసం అన్నట్లుగా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు చెబుతున్నారు. మాతృభాషను అమితంగా ఆరాధించే తమిళుల గడ్డ మీద.. తెలుగు ఉనికి కోసం పోరాడటం పెద్ద సాహసంగానే చెప్పాలి. మరి.. ఇలాంటి చర్య పవన్ కు ఎలాంటి కష్టాల్ని తెస్తుందన్నది ఇప్పుడ చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తెలుగు వారి కోసం ఏ రాజకీయ అధినేత.. మరే సినీ ప్రముఖుడు చేయని సాహసాన్ని పవన్ కల్యాణ్ చేస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదంతే.