ప‌వ‌న్ పుస్త‌కానికి ఘోస్ట్ రైట‌ర్ ఎవ‌రో తెలుసా?

Update: 2016-09-14 07:15 GMT
ప‌వ‌ర్ స్టార్ -  జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుస్త‌కం రాస్తున్నాడు. ఆయ‌న‌కు పుస్త‌కాలు రాయ‌డం కొత్త‌కాదు. అయితే, ఆ పుస్త‌కాల‌ను ఆయ‌నే రాస్తున్నాడా? ఎవ‌రైనా ఘోస్ట్ రైటర్స్ ఉన్నారా? అనేది ప్ర‌స్తుతం అంద‌రినీ తొలిచేస్తున్న ప్ర‌శ్న‌. వాస్త‌వానికి రెండున్న‌రేళ్ల కింద‌ట జ‌న‌సేన పార్టీని స్థాపించిన స‌మ‌యంలో ఇజం పేరుతో పుస్త‌కాన్ని అచ్చేశారు. అయితే - అందులో మ‌సాలా లేక‌పోవ‌డంతో జ‌నాలు అంత‌గా దానిని ప‌ట్టించుకోలేద‌నుకోండి. ఇక‌, ఇప్పుడు నేను-మ‌నం-జ‌నం పేరుతో ఓ పుస్త‌కానికి రూప‌క‌ల్ప‌న చేశాడు ప‌వ‌న్‌. దీనికి మార్పుకోసం యుద్ధం అని ట్యాగ్‌ లైన్ కూడా పెట్టాడు. దీనిని బ‌ట్టి.. ఈ పుస్త‌కం ఓ రేంజ్‌ లో ప్ర‌స్తుత పొలిటిక‌ల్ పార్టీల‌ను క‌డిగేయ‌డంతోపాటు.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైనా కొత్త యారోలు సంధిస్తుంద‌ని తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో మార్పు కోసం యుద్ధం అన్న ట్యాగ్‌ లైన్‌ ను బ‌ట్టి.. జ‌న‌సేన పార్టీ ద్వారా తాను ఎలాంటి మార్పు కోరుకుంటున్నాడో ఈ పుస్త‌కం ద్వారా వెల్ల‌డించే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, ఈ బుక్‌ పై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. మ‌రో మూడు నెల‌ల్లో ఈ పుస్త‌కాన్ని మ‌ర్కెట్‌ లోకి తీసుకురావాల‌నే ప్లాన్‌ లో ఉన్నాడు ప‌వ‌న్‌. ఈ బుక్ ద్వారానే పొలిటిక‌ల్ భ‌విష్య‌త్తును కూడా ఆయ‌న ప‌టిష్టం చేసుకోనున్నాడ‌ని స‌మాచారం. ఈ బుక్ ద్వారా త‌న పార్టీ వ్యూహాలు - ప్ర‌తి వ్యూహాలు - ల‌క్ష్యాలు మొత్తంగా వెల్ల‌డిస్తాడ‌ని అంటున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అస‌లింత‌కీ.. నేను-మ‌నం-జనం పుస్త‌కాన్ని ప‌వ‌నే రాస్తున్నాడా? ప‌వ‌న్ పేరుతో ఘోస్ట్ రైట‌ర్  ఎవ‌రైనా ఉన్నారా? అని ఇప్ప‌డు పొలిటిక‌ల్‌ గా పెద్ద డిబేట్ న‌డుస్తోంది.

గ‌తంలో ఇజం పుస్త‌కాన్ని మాత్రం ప‌వ‌న్ రాయ‌లేదు. దీనిని రాజు ర‌వితేజ్ రాశారు. బుక్ టైటిల్స్‌లో కూడా రాజు ర‌వితేజ్ పేరు ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం పొలిటిక‌ల్‌ గా మంచి ట‌ర్న్ ఇస్తుంద‌ని భావిస్తుండ‌డంతో దీనిని ప‌వ‌నే రాస్తాడ‌ని అంద‌రూ అనుకుంటున్నా.... ఇప్పుడు కూడా ప‌వ‌న్‌ ఘోస్ట్ రైట‌ర్‌ తోనే ఈ పుస్త‌కాన్ని రాయిస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో తనకు చాలా నమ్మకంగా పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నే ఘోస్ట్ రైటర్ గా పెట్టుకున్నాడట. అయితే, ఈయన వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ప‌వ‌న్‌ తన అభిరుచులను డిక్టేట్ చేస్తే.. ఈయ‌న పేప‌ర్‌ పై పెడుతున్న‌ట్టు న్యూస్‌! చాప్టర్స్ వైజ్ పవన్ త‌న వాయిస్‌ ను రికార్డర్ లో  వినిపిస్తే దానిని పుస్తక రూపంలో ఈయ‌న‌ మారుస్తాడట. ప్రస్తుతానికి ప‌వ‌న్ బుక్ గురించి ఉన్న స‌మాచారం ఇది! భ‌విష్య‌త్తులో ఇంకెన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయో చూడాలి.
Tags:    

Similar News